Prabhas : అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చాడా? ఇందులో నిజమెంత?

అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చారని.. ఆలయ ప్రారంభోత్సవం రోజు ఆహారపు ఖర్చులు పెట్టుకునేందుకు ముందుకు వచ్చారని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత?

Prabhas : అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చాడా? ఇందులో నిజమెంత?

Prabhas

Prabhas : అయోధ్యలో జనవరి 22న ప్రారంభమవుతున్న రామ మందిరానికి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు ఆలయ ప్రారంభోత్సవం రోజు ఆహారపు ఖర్చు పెట్టుకుంటానని ప్రభాస్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అసలు ఈ వార్తల్లో వాస్తవమేంటి?

Also Read: ‘మార్కెట్ మహాలక్ష్మి’ టైటిల్ భలేగుందే.. కేరింత పార్వతీశం హీరోగా..

అయోధ్యలో జనవరి 22న ప్రారంభమవుతున్న రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల ఏపీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆ రోజు ఆహార ఖర్చులను చూసుకోవడానికి ప్రభాస్ ముందుకు వచ్చారంటూ మాట్లాడారు. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియలేదు. అందుకు కారణం కూడా ఉంది. నిజానికి రామ మందిర ప్రారంభోత్సవానికి  ప్రభాస్‌కు ఆహ్వానం అందలేదు. రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్‌లతో పాటు కొందరు సౌత్ సెలబ్రిటీలకు మాత్రం ఆహ్వానం అందింది. ఆహ్వానమే అందుకోని ప్రభాస్ ఆహార ఖర్చులు పెట్టుకుంటానని హామీ ఇచ్చారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవమెంతో ప్రభాస్ టీమ్ మెంబర్లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Also Read: ప్రభాస్‌ ఆ డైరెక్టర్స్ వద్దే కంఫర్టబుల్‌గా ఉంటాడట.. పాపం రాజమౌళి.. వైరల్ అవుతున్న వీడియో..

కాగా ప్రభాస్ ‘సలార్’ పార్ట్ వన్ సూపర్ హిట్ అయ్యింది. మారుతి డైరెక్షన్‌లో ది రాజా సాబ్, సలార్ పార్ట్ 2, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, కల్కి 2898 AD సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.