Market Mahalakshmi : ‘మార్కెట్ మహాలక్ష్మి’ టైటిల్ భలేగుందే.. కేరింత పార్వతీశం హీరోగా..
తాజాగా నేడు ఈ మార్కెట్ మహాలక్ష్మి సినిమా టైటిల్ పోస్టర్ ని బిగ్‌బాస్ ఫేమ్ శివాజీ(Sivaji) చేతుల మీదగా లాంచ్ చేశారు.

Market Mahalakshmi Title Poster Launch by Bigg Boss Sivaji
Market Mahalakshmi : కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం(Parvateesam) ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో రాబోతున్నాడు పార్వతీశం. పార్వతీశం హీరోగా, ప్రణీకాన్వికా హీరోయిన్ గా వియస్ ముఖేష్ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. అఖిలేష్ కలారు బి2పి స్టూడియోస్ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో అమృతం హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా నేడు ఈ మార్కెట్ మహాలక్ష్మి సినిమా టైటిల్ పోస్టర్ ని బిగ్‌బాస్ ఫేమ్ శివాజీ(Sivaji) చేతుల మీదగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. మార్కెట్ మహాలక్ష్మి పోస్టర్ లాంచ్ అనంతరం శివాజీ మాట్లాడుతూ.. నేను 27 ఏళ్ళ వయసులో యాక్టింగ్ మొదలుపెడితే ఇప్పుడు 50 ఏళ్ళకి మంచి గుర్తింపు వచ్చింది. అందరికి ఏదో ఒకరోజు మంచి గుర్తింపు వస్తుంది. కాకపోతే ఓపిక ఉండాలి, కష్టపడాలి. కేరింత సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన పార్వతీశంకి ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుంది. ఈ సినిమా టీం అందరికి అల్ ది బెస్ట్ అని అన్నారు.
Also Read : Naga Vamsi : మా సైడ్ నుంచి అదే తప్పు అనుకుంటున్నాం.. ‘గుంటూరు కారం’పై నిర్మాత కామెంట్స్..
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. నేను ఆల్రెడీ మార్కెట్ మహాలక్ష్మి సినిమా చూశాను. చూస్తున్నంతసేపు నాకు శేఖర్ కమ్ముల గారి సినిమాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ఒక చక్కటి ఫ్యామిలీ లవ్ డ్రామా గా రాబోతుంది. అందరూ అద్భుతంగా పనిచేసారు ఈ సినిమా కోసం అని అన్నారు. త్వరలోనే ఈ మార్కెట్ మహాలక్ష్మి సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచనున్నారు. టైటిల్ ఇంత వెరైటీగా ఉందంటే సినిమా ఇంకెంత వెరైటీగా ఉంటుందో. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. ఇక ఈ మార్కెట్ మహాలక్ష్మి టైటిల్ కి వర్క్ ఫ్రమ్ మార్కెట్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం గమనార్హం. నిన్న రిలీజ్ చేసిన టైటిల్ ప్రమోషన్ వీడియో కూడా కొత్తగా ఉంది.