Pet Dog : చనిపోయిన యజమాని కోసం ఆహారం తినటం మానేసి ఎదురు చూస్తున్న కుక్క..

చనిపోయిన యజమాని కోసం ఆస్పత్రి వద్ద నాలుగు నెలలుగా ఎదురు చూస్తోంది ఓ కుక్క. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pet Dog : చనిపోయిన యజమాని కోసం ఆహారం తినటం మానేసి ఎదురు చూస్తున్న కుక్క..

pet dog waiting for dead owner.

pet dog waiting for dead owner In kerala hospital : జంతువులు అన్నింటిలోను మనుషులకు అంత్యత దగ్గరగా ఉండేవి కుక్కలు. ఆప్యాయంగా గుప్పెడు మెతులు పెడితే చాలు వాటి జీవితమంతా ఎంతో విశ్వాసంగా యజమానులను కంటికి రెప్పలా కాపాడుకు పెంపుడు జంతువు ఏది అంటూ ఠక్కున కుక్క అనే చెబుతాం. విశ్వాసానికి మారు పేరు కుక్కలు. మనుషులతో కలిసిపోయి జీవించటమే కాదు..యజమానులకు సహాయంగా ప్రేమతో అంటిపెట్టుకుని ఉంటాయి. అటువంటి యజమాని కనిపించకపోతే తిండి కూడా తినవు. అందుకే విశ్వాసానికి మారు పేరు గల జంతువు కుక్క అని అంటారు.

కేరళలో ఓ కుక్క అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన యజమాని కోసం నెలల తరబడి ఎదురు చూస్తోంది. అస్వస్థతకు గురై ఆస్పత్రిలోనే అతను చనిపోగా అది తెలియని ఆ కుక్క తన యజమాని కోసం నాలుగు నెలలుగా ఎదురు చూస్తోంది. తిండి కూడా తినకుండా గుమ్మంవైపే యజమాని వస్తాడనే ఆశగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తారు అని అంటారు కదా..అచ్చు అలాగే ఆస్పత్రి ఎదురుగా కూర్చుని ఎదురు చూస్తోంది.

కేరళలోని కన్నూరు జిల్లాలో ‘రాము’ అనే కుక్క తన యజమానికి అస్వస్థతగా ఉంటంతో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స చేయించినా ఫలితం లేక సదరు వ్యక్తి చనిపోయాడు. దీంతో ఆయన మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీ రూముకు తరలించారు. తరువాత మృతదేహాన్ని ఆస్పత్రి వెనుక నుంచి (మార్చురీ నుంచి) తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు అతని కుటుంబ సభ్యులు. కానీ రాము మాత్రం యజమాని  బయటకు వస్తాడని తనను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడనే ఆశతో ఆస్పత్రి ఎదురుగా ఉండి ఎదురు చూస్తోంది.

దాన్ని బాధ అర్థం చేసుకున్న వికాస్ అనే ఆస్పత్రి సిబ్బంది దానికి బిస్కెట్లు వంటివి ఇస్తున్నా తినటంలేదని యజమాని అంటే దానికి ఎంత ఇష్టమో తెలుస్తోంది అంటు చెప్పుకొచ్చాడు. మార్చురీ రూము బయట అది నాలుగు నెలలుగా వేచి చూస్తోందని..యజమాని ఇంకా బతికే ఉన్నాడని వస్తాడని అనుకుంటోంద తెలిపాడు. మొదట్లో ఆ కుక్కను తాను పట్టించుకోలేదనీ..కానీ తరువాత గమనించి పరిశీలించగా యజమాని రాక కోసం ఆశగా ఎదురు చూస్తోందని తెలిసి చాలా బాధ కలుగుతోందన్నాడు. ఈ విషయం తెలిసినప్పనుంచి దానికి ఆహారం పెట్టినా తినలేదని తరువాత ..తరువాత బిస్కెట్లు వంటివి పెడితే కాస్త తిన మిగిలినవి వదిలేస్తోందని నిజంగా కుక్కలు ఎంతటి విశ్వాసం కలవో ఇటువంటి సందర్భాల్లో అర్థమవుతోందని తెలిపాడు. రాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.