Bombay HC : ఒక ఫ్లాట్ ఉన్నవాళ్లకు 4,5 కార్లు ఉండటం కుదరదు: బాంబే హైకోర్టు

అపార్ట్ మెంట్స్ లో ఒక్క ప్లాట్ ఉన్నవాళ్లు ఒకటి లేదా రెండు వాహనాలు అంటే ఫోర్ వీలర్స్ (కార్లు) ఉండటం కుదరదు అంటూ బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబయిలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్న క్రమంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.

Bombay HC : ఒక ఫ్లాట్ ఉన్నవాళ్లకు 4,5 కార్లు ఉండటం కుదరదు: బాంబే హైకోర్టు

Bombay Hc Comments On Parking Problem (1)

Updated On : August 14, 2021 / 11:14 AM IST

Bombay HC comments on parking problem : అపార్ట్ మెంట్స్ లో ఒక్క ప్లాట్ ఉన్నవాళ్లు ఒకటి లేదా రెండు వాహనాలు అంటే ఫోర్ వీలర్స్ (కార్లు) ఉండటం కుదరదు అంటూ బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబయిలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్న క్రమంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఓ సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇటువంటి వ్యాఖ్యలు చేసింది.

ముంబైలో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో పార్కింగ్ సమస్య తీవ్రతమవుతోంది. ముఖ్యంగా అపార్ట్ మెంట్లలలో ఒక్క ఫ్లాట్ ఉన్నవారు కూడా రెండుకు మించి అంటే నాలుగు లేదా ఐదు కార్లు ఉంటంతో పార్కింగ్ ప్లేస్ సరిపోక వాటిని రోడ్లమీదనే పార్క్ చేస్తున్నారు. దీంతో వీధుల్లో వాహానాలు తిరగటానికి కూడా వీలు లేకుండాపోతోంది పాదచారులు నడవటానికి కూడా ఇబ్బందిగా మారింది. ఈ సమస్యపై నవీ ముంబయికి చెందిన సామాజిక కార్యకర్త సందీప్ ఠాకూర్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలుచేశారు.

ఈ పిటీషన్ లో కులకర్ణి..నిర్మాణ రంగంలో ఉండే బిల్డర్లు, డెవలపర్లు తాము నిర్మించే అపార్ట్ మెంట్లలో తగినంత పార్కింగ్ స్థలం చూపించడంలేదని..దీనివల్ల అపార్ట్ మెంట్ వాసులు తమ నివాస సముదాయాల వెలుపల వాహనాలు నిలుపుకోవాల్సి వస్తోందని సందీప్ ఠాకూర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అనంతరం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇకపై ఒక ఫ్లాట్ సొంతదారులు నాలుగైదు కార్లు కలిగి ఉండడం కుదరదని స్పష్టం చేసింది. మహారాష్ట్రలో వాహనాల పార్కింగ్ కు నిర్దిష్టమైన విధానమంటూ లేకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని..సొంతంగా తగినంత పార్కింగ్ స్థలం లేనివాళ్లను ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కొనకూడదని అలా కొంటే వాటిని అనుమతించవద్దని అధికారులను ఆదేశాలు జారీ చేసింది.

రోడ్లు వాహనాలతో క్రిక్కిరిసిపోతున్నాయని..రోడ్డుకు ఇరువైపులా 30 శాతం ప్లేసు వాహనాల పార్కింగ్ కే సరిపోతోందని..నగరంలో ఎక్కడ చూసినా ఇదే తీరుగా ఉందని..ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చాలా అవసరమని స్పష్టంచేసింది. ఈ సమస్య పరిష్కారం దిశగా అధికారులు యోచించాలని సూచించింది. దీనికి సమర్థవంతమైన విధానాన్ని రూపొందించాలని కోర్టు అధికారులకు స్పష్టం చేసింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది మనీష్ పాబ్లేకు ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.