Delhi-NCR : ఢిల్లీని కుదిపేసిన భూకంపం..ఊగిన ఫ్యాన్లు, పగిలిన భవనాల కిటికీల అద్దాలు
దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో శుక్రవారం అర్దరాత్రి వచ్చిన భూ ప్రకంపనలతో జనం తీవ్ర భయాందోళనలు చెందారు. ఉత్తర భారతదేశంలో సంభవించిన భూప్రకంపనలు పలు ప్రాంతాలను కుదిపేశాయి....

Fans, lights shake
Delhi-NCR : దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో శుక్రవారం అర్దరాత్రి వచ్చిన భూ ప్రకంపనలతో జనం తీవ్ర భయాందోళనలు చెందారు. ఉత్తర భారతదేశంలో సంభవించిన భూప్రకంపనలు పలు ప్రాంతాలను కుదిపేశాయి. భూ ప్రకంపనలతో ఊగిన ఫ్యాన్లు, పలు భవనాల కిటికీల అద్దాలు పగిలాయి. ఇళ్లలోని వస్తువులు సైతం కిందపడ్డాయి. దీంతో నిద్రపోతున్న జనం లేచి రోడ్లపైకి పరుగులు తీశారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడారు.
Also Read : Delhi-NCR Earthquake : నేపాల్ భూకంపం ఎఫెక్ట్…ఢిల్లీ,ఎన్సీఆర్ ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు
శుక్రవారం రాత్రి 11.32 గంటలకు భూకంపం రావడంతో వారాంతం కోసం సిద్ధమవుతున్న సమయంలోనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవు. నోయిడా, ఎన్‌సిఆర్ ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో ఎత్తైన నివాస భవనాలలో నివసించే ప్రజలు సురక్షితంగా బయటకు వచ్చారు. భూప్రకంపనలు 15 సెకన్ల పాటు సాగాయని, దీని వల్ల తమ ఇంటి కిటికీ అద్దాలు పగిలాయని ఘజియాబాద్ వాసి చెప్పారు.
Also Read : Nepal Earthquake : నేపాల్‌లో భారీ భూకంపం…37 మంది మృతి
ఢిల్లీ నివాసులు పలువురు భూప్రకంపనల వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. నేపాల్‌లో బలమైన భూకంపాలు సంభవించడం నెల రోజుల్లో ఇది మూడోసారి. లక్నో, జైపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్‌లోని చాలా ప్రాంతాలు, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది.