AC 3-tier Coaches : రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్, తక్కువ ధరకే ఏసీ కోచ్‌ ప్రయాణం

రైలు ప్రయాణికులకు ఇది శుభవార్తే. ఇకపై తక్కువ ధరకే ఏసీ కోచ్ లో ప్రయాణం చేయొచ్చు. ఏసీ కోచ్ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. ఏసీ కోచ్‌లో ప్రయాణించాలని చాలామందికి ఉంటుంది.

AC 3-tier Coaches : రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్, తక్కువ ధరకే ఏసీ కోచ్‌ ప్రయాణం

Ac 3 Tier Coaches

Updated On : August 28, 2021 / 8:03 PM IST

AC 3-tier Coaches : రైలు ప్రయాణికులకు ఇది శుభవార్తే. ఇకపై తక్కువ ధరకే ఏసీ కోచ్ లో ప్రయాణం చేయొచ్చు. ఏసీ కోచ్ టికెట్ల ధరలు తగ్గనున్నాయి. ఏసీ కోచ్‌లో ప్రయాణించాలని చాలామందికి ఉంటుంది. కానీ వేలల్లో ఉండే టికెట్ ధరలు చూసి వెనక్కి తగ్గుతారు. తప్పని పరిస్థితుల్లో స్లీపర్ క్లాస్‌లోనే జర్నీ చేస్తున్నారు. ఇక ముందు అలాంటి భయం లేదు. తక్కువ ధరకే ఏసీ క్లాస్ టికెట్స్ ఇచ్చేందుకు రైల్వేశాఖ ప్లాన్ చేసింది.

Microsoft Windows 11 కొత్త OS వస్తోంది.. మీ PC సపోర్ట్ చేయాలంటే?

సామాన్య ప్రజలకు తక్కువ ధరకే ఏసీ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్‌లో స్పెషల్‌ ఎకానమీ ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ కోచ్‌లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే భావిస్తోంది. వీటి టికెట్ ధరలు ఏసీ-3టైర్ కంటే తక్కువగా.. స్లీపర్ క్లాస్ కంటే కాస్త ఎక్కువగా ఉంటాయి.

స్పెషల్ ఎకానమీ ఏసీ -3 టైర్ కోచ్‌ల్లో టికెట్ ధరలు సాధారణ ఏసీ-3 టైర్ కంటే 8శాతం తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే 300 కి.మీ వరకు బేస్ ఛార్జీ రూ.440 ఉంటుందని సమాచారం. ఇది 4,951 నుంచి 5,000 కిమీలకు.. చార్జి గరిష్టంగా రూ.3,065 ఉండనున్నట్లు సమాచారం. ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసమే ఈ ప్రత్యేక కోచ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు.

Bollywood Stars Bodyguards : అమితాబ్ నుంచి షారుక్ ఖాన్ వరకు.. బాడీగార్డులకు కోట్లు చెల్లిస్తున్న స్టార్స్

ఒక రైలులో ఏసీ3 కోచ్‌ల కంటే ఏసీ3 ఏకానమీ కోచ్‌లు 15శాతం ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక రైలులో ఏసీ3 కోచ్‌ల్లో 72 బెర్త్‌లు ఉంటాయి. కానీ ఏసీ3 ఎకానమీ కోచ్‌లలో 83 బెర్తులుంటాయి. సాధారణ కోచ్‌ల్లో సైడ్ బెర్త్‌లు రెండు మాత్రమే ఉంటే.. ఈ కోచ్‌లు వాటి సంఖ్యను మూడుకు పెంచారు.

ఈ ఏడాది చివరి కల్లా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దాదాపు 806 ఏసీ-3 టైర్ ఎకనామీ క్లాస్ కోచ్‌లు సిద్ధం చేయాలని రైల్వే భావిస్తోంది. ఇందులో 300 కోచ్‌లు చెన్నైలో, 285 కోచ్‌లు రాయ్‌బరేలీలో, 177 కోచ్‌లు కపుర్తలలో తయారవుతున్నాయి.