కేంద్రంతో నేడు రైతుల ఆరో దఫా చర్చలు..నాలుగు అంశాల అజెండా

కేంద్రంతో నేడు రైతుల ఆరో దఫా చర్చలు..నాలుగు అంశాల అజెండా

Updated On : December 30, 2020 / 7:38 AM IST

Farmers’ sixth round of talks with the union government today  :  వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌తో నిరవధికంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో చర్చలు ప్రారంభమవుతాయి. చర్చలకు రావాలంటూ 40 రైతు సంఘాలకు కేంద్రం ఇప్పటికే లేఖలు రాసింది.

కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలంటూ రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తుండగా … కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. చట్టాలను రద్దు చేయడం వీలుపడదని… కావాలంటే రైతుల డిమాండ్లను బట్టి చట్టాల్లో సవరణకు కేంద్రం ఓకే అంటోంది. దీంతో ఇప్పటికే ఆరు సార్లు చర్చలు జరిగినా ఫలితం రాలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య అంతరం పెరుగుతోంది. ఆఖరికి రైతులు చర్చల సందర్భంగా ప్రభుత్వం అందించే టీ, స్నాక్స్‌, ఆహార పదార్థాలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.

చట్టాలు అమల్లోకి తెచ్చే ముందు రైతులతో అనేక సార్లు చర్చించామంటూ కేంద్రం చెబుతోంది. దీనికి సంబంధించి ఎంత మంది రైతులతో ఎప్పుడు, ఎన్ని సార్లు వ్యవసాయ చట్టాలపై చర్చలు జరిపారో తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు కేంద్రం వద్ద సమాధానం లేకుండా పోయింది. చర్చలకు సంబంధించి తమ వద్ద రికార్డులు లేవంటూ కేంద్రం వెల్లడించింది.

అంతకు ముందు వ్యవసాయ శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రులు అనేక చర్చల అనంతరమే ఈ చట్టాలను తెచ్చామని చెప్పారు. మంత్రి రవిశంక్‌ అయితే ఏకంగా 1.37 లక్షల వెబినార్లు నిర్వహించామని, 92 లక్షల మంది రైతుల ఈ చర్చలో పాల్గొన్నారని చెప్పారు. తాజాగా తమ వద్ద రికార్డులు లేవని కేంద్రం అం ది.

కేంద్ర ప్రభుత్వ తీరుపరై రైతు సంఘాలు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏకపక్షంగా కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఢిల్లీ కూర్చుని చట్టాలు చేస్తే సరిపోదంటూ ఎన్సీపీ నేత శరద్‌పవార్‌ కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ కామెంట్‌ చేశారు.