Insurance Amendment Bill 2021: ఎఫ్‌డీఐని 74 శాతానికి పెంచే బీమా సవరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) 74శాతానికి పెంచుకునేందుకు వీలు కల్పించే బీమా సవరణ బిల్లు 2021కు లోక్‌సభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమెదం తెలిపింది.

Fdi Insurance Amendement Bill Loksabha Aproval
Insurance Amendment Bill 2021: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) 74శాతానికి పెంచుకునేందుకు వీలు కల్పించే బీమా సవరణ బిల్లు 2021కు లోక్‌సభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమెదం తెలిపింది. ఇప్పటి వరకూ ఎఫ్‌డీఐల పరిమితి 49శాతం ఉంది.
బిల్లుపై జరిగిన చర్చలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ బీమా కంపెనీలకు అదనపు నిధులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వాటి ఆర్థిక సమస్యలను గట్టెక్కించేందుకు ఎఫ్ డీఐల పరిమితి పెంపు దోహదపడుతుందని తెలిపారు.
ప్రైవేటు కంపెనీలు నిధులు సమకూర్చుకోవడంలో ఎదరుయ్యే ఇబ్బందులను ప్రస్తుత బిల్లు పరిష్కరిస్తుందని వివరించారు. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్ డీఏఐ సిఫార్సుల మేరకే ఎఫ్ డీఐల పరిమితిని పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రతి బీమా కంపెనీ తప్పనసరిగా 74శాతం ఎఫ్ డీఐని పెంచాలన్న నిర్బంధమేమీ ఉండదని స్పష్టం చేశారు. బిల్లును రాజ్య సభ్య గత వారమే ఆమోదించింది.
గనులు, ఖనిజా (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లుకు రాజ్యసభ సోమవారం అప్రూవల్ తెలిపింది.