Police officer: మహిళా ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య
బీహార్ రాజధాని పాట్నా నగరంలోని చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 బ్యాచ్‌కి చెందిన 25ఏళ్ల ప్రీతి శర్మ అనే మహిళా ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.

Police
Police officer: బీహార్ రాజధాని పాట్నా నగరంలోని చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 బ్యాచ్‌కి చెందిన 25ఏళ్ల ప్రీతి శర్మ అనే మహిళా ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం(11 జనవరి 2022) మధ్యాహ్నం జరిగింది. ప్రీతి శర్మ బొకారోకు చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది.
ప్రీతి శర్మ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను చూసిన కుటుంబసభ్యులు ప్రీతిని దించి చికిత్స కోసం నలంద మెడికల్ కాలేజీ హాస్పిటల్ (NMCH)కి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. సరిగ్గా నెల రోజుల క్రితం డిసెంబర్ 11వ తేదీన రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమర్ అపార్ట్‌మెంట్‌లో ప్రీతి భర్త రోషన్ సాగర్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు.
షూ కంపెనీలో పనిచేసే రోషన్ సాగర్‌తో ప్రీతి శర్మ ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రీతి శర్మ ఏ కారణంతో ఆత్మహత్య చేసుకుందో ఇంకా తెలియరాలేదు. ఆమె భర్త రోషన్ సాగర్ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ప్రతీ శర్మ రోషన్ సాగర్‌ను ప్రేమ వివాహం చేసుకోగా.. వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా లేవని, ఈ క్రమంలోనే రోషన్ సాగర్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. తన భర్త మరణం తరువాత, ప్రీతి శర్మ డిప్రెషన్‌కు గురయ్యారని, ఈ కారణంగా ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమికంగా చెబుతున్నారు.