Fire In Train : రైలులో ఎగసిపడిన మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం
జమ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది

Fire In Train
Fire In Train : జమ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట రెండు ఏసీ కోచ్‌లలో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మరో రెండు ఏసీ కోచ్‌లకు మంటలు వ్యాపించడంతో.. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం గురించిన లోకోఫైలెట్ వెంటనే రైలును నిలిపేశాడు.
చదవండి : Fire Accident : సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
ధౌల్‌పూర్ (రాజస్థాన్), మోరినా(మధ్యప్రదేశ్) మధ్య ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ రైలు హేతంపూర్ నుంచి ఝాన్సీ రైలు వెళ్తుండగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. మంటల తీవ్ర అధికంగా ఉండటంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మందలు అదుపు చేశారు.
చదవండి : Fire in Bus : టూరిస్టు బస్సులో మంటలు.. 12 మంది చిన్నారులు సహా 45 మంది సజీవ దహనం