Chamba Bus Stand : పబ్లిక్ టాయిలెట్ లో కార్మికుల ఐసోలేట్, కాంట్రాక్టర్ నిర్వాకం

కాంట్రాక్టర్ మాత్రం కరోనా సోకిన కార్మికులను క్వారంటైన్ సెంటర్ కు తరలించకుండా.. బస్టాండు పబ్లిక్ టాయిలెట్ లో ఐసోలేట్ చేసిన ఘటన అందర్నీ విస్తుపోయేలా చేసింది.

Chamba Bus Stand : పబ్లిక్ టాయిలెట్ లో కార్మికుల ఐసోలేట్, కాంట్రాక్టర్ నిర్వాకం

Himachal

Updated On : April 30, 2021 / 4:58 PM IST

Isolated : కరోనా సోకిన రోగుల పట్ల సానుభూతి చూపించాలని, వివక్ష చూపొద్దని చెబుతున్నా..కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. వైరస్ సోకిన వారిని దూరంగా పెడుతున్నారు. ఇక వైరస్ విజృంభిస్తుండడంతో లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతుండడంతో వలస కార్మికులు సొంత గ్రామాలకు వెళ్లిపోతున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు సొంత ఊళ్లకు వెళ్లకుండా..వీరికి ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

అయితే..ఓ కాంట్రాక్టర్ మాత్రం కరోనా సోకిన కార్మికులను క్వారంటైన్ సెంటర్ కు తరలించకుండా.. బస్టాండు పబ్లిక్ టాయిలెట్ లో ఐసోలేట్ చేసిన ఘటన అందర్నీ విస్తుపోయేలా చేసింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. చంబాలోని పంగి ట్రైబల్ ఏరియాలో బస్టాండ్ నిర్మాణం కోసం ఓ కాంట్రాక్టర్ 20 మంది కార్మికులను ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు. కొంత అస్వస్థతగా ఉండగా..వీరికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో ఐదుగురికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

క్వారంటైన్ సెంటర్ కు తరలించకుండా..పబ్లిక్ టాయిలెట్ లో ఉంచాడని స్థానికంగా ఉన్న ఆప్ నేత మహ్మద్ సలీం వెల్లడించారు. హిమాచల్ ప్రభుత్వానికి సిగ్గు చేటుగా ఆయన అభివర్ణించారు. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లి కోవిడ్ బారిన పడిన ఐదుగురు కార్మికులను బస్టాండ్ లోని వేరే బ్లాక్ కు తరలించినట్లు చంబా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ కపిల్ శర్మ తెలిపారు.

Read More : Dil De Diya : జాక్వెలిన్‌తో కలిసి జాతర చేసిన సల్మాన్ ఖాన్..