Kanwar Yatra Tragedy : కన్వర్ యాత్రలో విషాదం.. విద్యుత్ షాక్ తో ఐదుగురు దుర్మరణం

హరిద్వార్ లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు మీరట్ కు చేరుకుంది. ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్ విద్యుత్ హై టెన్షన్ వైరుకు తగిలింది.

Kanwar Yatra Tragedy : కన్వర్ యాత్రలో విషాదం.. విద్యుత్ షాక్ తో ఐదుగురు దుర్మరణం

Kanwar Yatra

Electric Shock Five Died : ఉత్తరప్రదేశ్ లో కన్వర్ యాత్రలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో ఐదుగురు యాత్రికులు మృతి చెందారు. హరిద్వార్ లో పవిత్ర జలాలను తీసుకెళ్తున్న కన్వరీల వాహనం మీరట్ లో విద్యుత్ షాక్ కు గురైంది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు కన్వరీలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హరిద్వార్ లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు మీరట్ కు చేరుకుంది.

ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్ విద్యుత్ హై టెన్షన్ వైరుకు తగిలింది. దీంతో వాహనం మొత్తం విద్యుత్ షాక్ రావడంతో అందులో ఉన్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో ఐదుగురు చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు వెల్లడించారు. మిగిలిన ఐదుగురు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

USA Shooting : అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురిని తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు

కన్వరీల మృతిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే కన్వరీలు మరణించారని స్థానికులు నిరసనకు దిగారు. దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించారు.