ఉదృతంగా రైతు ఉద్యమం..భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్ట్..

పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు ఉత్తర ప్రదేశ్ సహా డజనుకు పైగా రాష్ట్రాల్లో రైతులు ఎన్నో రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వీధుల్లోకి చేరుకుని రైతులు ఉద్యమం చేస్తుండగా.. ఇదే సమయంలో షకర్పూర్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ తర్వాత ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు.
వీరిలో ఇద్దరు పంజాబ్‌కు చెందినవారు కాగా.., మరో ముగ్గురు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వ్యక్తులుగా చెబుతున్నారు. వీరంతా ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖలీస్తాన్‌తో సంబంధం కలిగి ఉన్నవారని, వారికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో కూడా సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ ఐదుగురు ఉగ్రవాదులు ఐఎస్ఐ ఆదేశాల మేరకు భారీ కుట్రకు ప్లాన్ చేశారని, ముందస్తు సమాచారంతో పోలీసులు కుట్రను భగ్నం చేసినట్లుగా వెల్లడించారు. ఢిల్లీ నుంచి యూపీ, హర్యానా సరిహద్దులకు వేలాది మంది వస్తుండగా.. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులు(ఘజియాబాద్ మరియు నోయిడా) టిక్రి సరిహద్దు, సింగు సరిహద్దు చాలా రోజులు నుంచి మూసివేయబడింది.
అరెస్టయిన ఐదుగురి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడుకు సంబంధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి రగ్గులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధానిలో కొంతమంది ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారని పక్కా సమాచారం ప్రకారం ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఎన్‌కౌంటర్ జరిగినప్పటికీ.. పోలీసులు వారిని సజీవంగా పట్టుకోగలిగారు.