Flipkart Fined : రూ.12వేల ఫోన్ విషయంలో ఫ్లిప్‌కార్ట్‌కు కన్జూమర్ కమిషన్ షాక్.. రూ.42వేలు జరిమానా

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు బెంగళూరు అర్బన్ డిస్ట్రిక్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. రూ.42వేలు జరిమానా విధించింది. ఓ సెల్ ఫోన్ కొనుగోలుకు సంబంధించి కస్టమర్ నుంచి రూ.12,499 మొత్తాన్ని ముందుగానే తీసుకుని ఫోన్ ను డెలివరీ చేయనందుకు ఈ ఫైన్ విధించింది కమిషన్.

Flipkart Fined : రూ.12వేల ఫోన్ విషయంలో ఫ్లిప్‌కార్ట్‌కు కన్జూమర్ కమిషన్ షాక్.. రూ.42వేలు జరిమానా

Updated On : January 4, 2023 / 10:43 PM IST

Flipkart Fined : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు బెంగళూరు అర్బన్ డిస్ట్రిక్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. రూ.42వేలు జరిమానా విధించింది. ఓ సెల్ ఫోన్ కొనుగోలుకు సంబంధించి కస్టమర్ నుంచి రూ.12,499 మొత్తాన్ని ముందుగానే తీసుకుని ఫోన్ ను డెలివరీ చేయనందుకు ఈ ఫైన్ విధించింది కమిషన్. జనవరి 15, 2022న ఆర్డర్ తో పాటు పేమెంట్ చేసిన మొబైల్ కు సంబంధించి.. ఇంతవరకు డెలివరీ చేయనందుకు ఈ ఫైన్ వేసింది కమిషన్.

ఆమె పేరు దివ్యశ్రీ. బెంగళూరు రాజాజీనగర్ నివాసి. జనవరి 15, 2022న ఫ్లిప్ కార్ట్ లో రూ.12,499కి ఓ ఫోన్ ను ఆర్డర్ చేసింది. ప్రొడెక్ట్ చేతికి అందకుండానే.. ఆ డబ్బు చెల్లించింది. అయితే, ప్రొడక్ట్ మాత్రం ఆమె చేతికి అందలేదు. ఫోన్ డెలివరీ కాలేదు. దీని గురించి దివ్యశ్రీ చాలాసార్లు ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులను సంప్రదించింది. తన ఫోన్ గురించి ఆరా తీసింది. తన ప్రొడక్ట్ ఇంకా డెలివరీ కాలేదని ఫిర్యాదు చేసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆమె ఆర్డర్ చేసిన ఫోన్ ఆమెకు అందలేదు.

Also Read..Amazon Flipkart : అయ్యో అమెజాన్, పాపం ఫ్లిప్‌కార్ట్.. భారీ నష్టాల్లో ఈ-కామర్స్ దిగ్గజాలు.. ఎందుకిలా?

ఆ తర్వాత ఫ్లిప్ కార్ట్ నుంచి ఆమెకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విసిగిపోయిన దివ్యశ్రీ.. వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించింది. ఫ్లిప్ కార్ట్ పై ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కమిషన్.. ఇటీవలే తీర్పు ఇచ్చింది. ఫ్లిప్ కార్ట్ తీరుని తప్పుపట్టిన కమిషన్ జరిమానా విధించింది. కస్టమర్ చెల్లించిన రూ.12వేల 499తో పాటు ఏడాదికి 12శాతం వడ్డీ, దాంతో పాటు రూ.20వేల జరిమానా, రూ.10వేలు చట్టపరమైన ఖర్చుల కోసం చెల్లించాలని ఫ్లిప్ కార్ట్ ను కమిషన్ ఆదేశించింది. కమిషన్ చైర్ పర్సన్ శోభా, మెంబర్ రేణుకాదేవి దేశ్ పాండ్ ఈ తీర్పుని ఇచ్చారు.

సేవ విషయంలో ఫ్లిప్ కార్ట్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కమిషన్ మండిపడింది. దాంతో పాటు అనైతిక పద్దతులను పాటించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్లిప్ కార్ట్ తీరు కారణంగా కస్టమర్ ఆర్థికంగా నష్టపోయింది పైగా మెంటల్ టార్చర్ చూసింది అని వ్యాఖ్యానించింది.

Also Read..Online Order Fraud : ఆన్‌లైన్‌లో కేక్‌ ఆర్డర్‌ చేస్తే.. బ్యాంకు అకౌంట్ నుంచి రూ.1.20 లక్షలు స్వాహా

కాగా, ఈ కామర్స్ సైట్ల విషయంలో ఇలా జరగడం కొత్త కాదు. పలు మార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. కస్టమర్ డబ్బు చెల్లించినా.. వారికి వస్తువులు మాత్రం అందలేదు. అందుకే, ఆన్ లైన్ షాపింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read..Flipkart Open Box Delivery : అరె.. ఏంట్రా ఇది.. ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే.. సబ్బు వచ్చింది.. రీఫండ్ ఇదిగో నాయనా..!

ఏదైనా వస్తువు కొనే ముందు విక్రయదారుడి వివరాలు చెక్ చేయాలని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఖరీదైన వస్తువులు కొనేటప్పుము మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్నింటికంటే ఉత్తమమైనది ఏంటంటే.. ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేసినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవడం సురక్షితం అంటున్నారు. మొత్తంగా ఆన్ లైన్ లో ఖరీదైన వస్తువులు కొనే విషయంలో.. సెల్లర్ రేటింగ్, కస్టమర్లు ఇచ్చిన రివ్యూలు కచ్చితంగా చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.