తుంగభద్రలో పెరుగుతున్న వరదనీరు

  • Published By: murthy ,Published On : June 22, 2020 / 01:38 AM IST
తుంగభద్రలో పెరుగుతున్న వరదనీరు

Updated On : June 22, 2020 / 1:38 AM IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లోకి  వరద నీరు వచ్చి చేరుతోంది.  కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు సాగునీరు అందించనున్న ఈ ప్రాజెక్టులో ఆదివారం నాడు ఇన్‌ఫ్లో 3,522 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి.

తాగునీటి అవసరాలకు 283 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు టీబీ డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. 100.856 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 6.404 టీఎంసీల నీటితో 1584.66 అడుగుల నీటి మట్టం ఉందని పేర్కొన్నారు. 

Read: కేంద్రం టెస్టింగ్ కిట్లన్నీ పశ్చిమబెంగాల్‌కు తరలించింది: తెలంగాణ