జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరగానే ఫోర్జరీ కేసు రీ ఓపెన్

జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరగానే ఫోర్జరీ కేసు రీ ఓపెన్

Updated On : March 13, 2020 / 9:47 AM IST

మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం(EOW) గురువారం కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై ఫోర్జరీ కేసు రీ ఓపెన్ చేసింది. ఓ స్థలాన్ని అమ్మేందుకు గాను తప్పుడు సర్టిఫికేర్టులు పుట్టించారనే ఆరోపణతో వారిపై గతంలోనే ఫోర్జరీ కేసు నమోదైంది. బుధవారం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జాయిన్ అయిన వెంటనే ఈ ఘటన జరగడం గమనార్హం. 

‘సురేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్‌ను రీ వెరిఫై చేస్తున్నాం’ అని ఆర్థిక నేరాల విభాగానికి చెందిన అధికారి వెల్లడించారు. సింధియా కుటుంబం 6వేల చదరపు అడుగుల స్థలాన్ని 2009లో తప్పుడు సర్టిఫికేట్లతో విక్రయించిందని గురువారం శ్రీవాస్తవ కంప్టైంట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 

గతంలో అంటే 2014 మార్చి 26న దీని గురించి ఫిర్యాదు చేసినప్పటికీ 2018లో అది క్లోజ్ అయిపోయింది. దానికి మరోసారి పిటిషన్ వేశారు. అందుకనే నిజాలు తెలుసుకునే దిశగా విచారణ జరుపుతున్నాం. 

Also Read | ఢిల్లీ వ్యక్తికి కరోనా….700మంది ఆఫీస్ ఉద్యోగులంతా దిగ్భందనం