Keshub Mahindra: మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూత

కేశబ్ మహీంద్రా 1923 అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించారు. 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్‌కు చైర్మన్‌గా పనిచేశారు. భారతదేశంలోని అత్యంత వృద్ధ బిలియనీర్‌గా గుర్తింపు పొందిన కేశబ్ మహీంద్రా 2012 ఆగస్టులో గ్రూప్ చైర్మన్‌గా పదవీ విరమణ పొందారు. ఆ బాధ్యతలను అతని మేనల్లుడు ఆనంద్ మహీంద్రాకు అప్పగించారు.

Keshub Mahindra: మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూత

Former Chairman of Mahindra Group Keshub Mahindra

Updated On : April 12, 2023 / 2:14 PM IST

Keshub Mahindra: మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్, పారిశ్రామిక వేత్త కేశబ్ మహీంద్రా (99) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా ధృవీకరించారు. ఈ మేయర్ ఆయన ట్వీటర్ ఖాతా ద్వారా నివాళి అర్పించారు. కేశబ్ మహీంద్రా మంచి వ్యక్తి. అతను వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, సామాజిక విషయాలను ఎలా కనెక్ట్ చేశాడనే దాని నుంచి ప్రేరణ పొందాను. ఓం శాంతి.. అని గోయెంకా ట్వీట్ చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కేశబ్ మహీంద్రా మృతికి నివాళులర్పించారు.

Anand Mahindra : నిమిషాల్లో వేలాది వేడి వేడి ఇడ్లీలు రెడీ .. వావ్ అంటున్న ఆనంద్ మహీంద్రా

కేశబ్ మహీంద్రా 1923 అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించారు. 1963 నుంచి 2012 వరకు మహీంద్రా గ్రూప్‌కు చైర్మన్‌గా పనిచేశారు. భారతదేశంలోని అత్యంత వృద్ధ బిలియనీర్ మహీంద్రా 2012 ఆగస్టులో గ్రూప్ చైర్మన్‌గా పదవీ విరమణ పొందారు. ఆ బాధ్యతలను అతని మేనల్లుడు ఆనంద్ మహీంద్రాకు అప్పగించారు. 1947లో కేశబ్ మహీంద్రా యుటిలిటీ వాహనాలను తయారు చేయడం, విక్రయించడం ద్వారా తన తండ్రి ప్రారంభించిన కంపెనీలో చేరాడు. 1987లో ఫ్రెంచ్ ప్రభుత్వంచే మహీంద్రాకు అవార్డు లభించింది. 2004 నుంచి 2010 వరకు వాణిజ్య, పరిశ్రమల ప్రధాన మంత్రి మండలి సభ్యుడుగా కూడా కేశబ్ మహీంద్రా పనిచేశారు.

Anand mahindra : ”హ్యాండ్ మేడ్ అండ్ ఫ్యాన్ మేడ్” ఐస్ క్రీమ్ .. మనసుంటే మార్గముంటుందంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో 2023లో భారతదేశంలోని 16 మంది కొత్త బిలియనీర్లలో అతను చేర్చబడ్డారు. కేశబ్ వ్యాపారవేత్తగా మహీంద్రా సెయిల్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, ఐసీఐసీఐతో సహా అనేక కంపెనీల బోర్డులలో పనిచేశారు. హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా కూడా ఉన్నారు.