Karnataka : యెడియూరప్ప మనవరాలు అనుమానాస్పద మృతి

ర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప మనవరాలు సౌందర్య విగతజీవిగా కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరులోని ఆమె ఇంట్లో మృతి చెంది కనిపించింది.

Karnataka : యెడియూరప్ప మనవరాలు అనుమానాస్పద మృతి

Karnataka

Updated On : January 28, 2022 / 3:18 PM IST

BS Yediyurappa’s Granddaughter Soundarya : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప మనవరాలు సౌందర్య విగతజీవిగా కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరులోని ఆమె ఇంట్లో మృతి చెంది కనిపించింది. సౌందర్య (30) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం Bowring ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. యెడియూరప్ప పెద్ద కూతురైన పద్మ కూతురు సౌందర్య.

Read More : India-Pak Border : భారత్-పాక్ సరిహద్దులో ఎన్‌కౌంటర్.. 47కిలోల హెరాయిన్ స్వాధీనం!

సౌందర్య వైద్యురాలు. 2018లో సౌందర్య వివాహం నీరజ్ తో వివాహం జరిగింది. ఓ బిడ్డ కూడా ఉన్నారు. వసంత నగర్ లోని మౌంట్ కార్మెల్ కాలేజీ సమీపంలో ఉన్న ఓ అపార్టమెంట్ సౌందర్య నివాసం ఉంటున్నారు. డాక్టర్ నీరజ్ ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇంట్లో పనిమనిషి వచ్చి తలుపు తట్టగా..తెరవకపోయేసరికి అనుమానం వచ్చి..డాక్టర్ నీరజ్ కు ఆమె విషయాన్ని తెలిపింది. వచ్చి చూడగా సౌందర్య చనిపోయి కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.