Ex Mp Gopalakrishnan : మద్యం మత్తులో వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్లిన ‘మాజీ ఎంపీ’.. చితకబాదిన ఓనర్
పూటుగా మద్యం సేవించిన మాజీ ఎంపీ.. తన ఇల్లు అనుకోని వేరే వాళ్ళింట్లోకి వెళ్లి గందరగోళం సృష్టించాడు. ఇంట్లోని వారితో గొడవకు దిగాడు. దీంతో ఎంపీని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Ex Mp Gopalakrishnan
Ex Mp Gopalakrishnan : పూటుగా మద్యం సేవించిన మాజీ ఎంపీ.. తన ఇల్లు అనుకోని వేరే వాళ్ళింట్లోకి వెళ్లి గందరగోళం సృష్టించాడు. ఇంట్లోని వారితో గొడవకు దిగాడు. దీంతో ఆ ఇంటివారు మాజీ ఎంపీని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెబితే కానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఆయన మాజీ ఎంపీ అనే విషయం తెలియలేదు.
చదవండి : Tamil Nadu : పోలీసులకు వీక్లీ ఆఫ్
వివరాల్లోకి వెళితే తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ.. అన్నాడీఎంకే నేత గోపాలకృష్ణన్ దీపావళి రోజు పూటుగా మధ్య సేవించాడు. ఆ మత్తులో మదురై నీలగిరి ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ నివాసంలోకి ప్రవేశించారు. తాగిన మైకంలో ఇంట్లోకి వెళ్లి వారితో గొడవ పడ్డాడు. పండుగ రోజు ఎవరో తాగుబోతు తమ ఇంట్లోకి వచ్చి అల్లరి చేస్తున్నాడని ఇంట్లోని వారు ఆయనను చితకబాదారు.. అనంతరం పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు అతడిని చూసి షాక్ అయ్యారు.
చదవండి : Tamil Nadu : ఆరో తరగతి విద్యార్థినికి సీఎం ఫోన్..ఏం చెప్పారంటే
అతనో మాజీ ఎంపీ అని ఆ ఇంట్లోని వారికి చెప్పి వెంటనే ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎంపీ అనే విషయం తమకు తెలియదని.. పండుగరోజు ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తుంటే బయటకు వెళ్ళమని చెప్పామని, కానీ అతడు ఎంతకు వినకపోవడంతో నాలుగు దెబ్బలు వేశామని తెలిపారు ఆ ఇంట్లోని వారు