Manmohan Singh funeral: అధికార లాంఛనాలతో ఇవాళ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. ఏ సమయానికి.. ఎక్కడంటే?
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ...

Former PM Manmohan Singh
Manmohan Singh passes away: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ భౌతికకాయానికి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మన్మోహన్ పార్ధివదేహాన్ని ఉదయం 8గంటలకు తన నివాసం నుంచి ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తారు. అక్కడ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పిస్తారు. అనంతరం 9.30 గంటల తరువాత అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. ఉదయం 11.45 గంటలకు మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఉదయం గం. 11.15కు హోంశాఖ కార్యదర్శి పుష్పగుచ్ఛాలను పెట్టడంతో అధికారిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుసగా త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, కేబినెట్ సెక్రటరీ, రక్షణ శాఖ మంత్రి, సహాయ మంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రధాని, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి పుష్పగుచ్ఛాలను ఉంచుతారు. ఉదయం 11.45గంటలకు మతపరమైన కార్యక్రమాలు, పార్దీవ దేహం దహనం ఉంటుంది.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు యమునా నది తీరంలోని రాజ్ ఘాట్ దగ్గర స్థలం కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే లేఖ రాశారు. అదేవిధంగా ఫోన్ కూడా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తాను ప్రధానికి రాసిన లేఖను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. గతంలో పలువురు మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞుల అంత్యక్రియలు రాజ్ ఘాట్ లోనే జరిగాయని, అక్కడే సంప్రదాయం ప్రకారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకం ఏర్పాటు కోసం అక్కడే స్థలం ఇవ్వాలని కోరారు.
స్మారక చిహ్నం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నుంచి ప్రభఉత్వానికి అభ్యర్థన అందిందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, మాజీ ప్రధానులకు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలో మన్మోహన్ సింగ్ కు అంత్యక్రియలు నిర్వహించాలంటూ కాంగ్రెస్ నేతలు కోరారు. మన్మోహన్ స్మారక చిహ్నాన్ని నిర్మించే ప్రాంతంలో అంత్యక్రియలు జరపాలని మోదీకి లేఖ రాసినా కేంద్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ని కేంద్రం అగౌరవ పరుస్తుందని ఆరోపించారు. నిగమ్ బోధ్ ఘాట లో మన్మోహన్ అంత్యక్రియలు జరపడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దేశానికి సేవ చేసిన మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థలం ఇవ్వకుండా బీజేపీ చిన్నబుద్ధి చూపిందని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశంలోని రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించి, తమ సంతాపాన్ని తెలియజేశారు. కాగా, ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధులు మన్మోహన్ సింగ్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా పనిచేశారు. ఈ క్రమంలో ఆయా దేశాల మధ్య భారత్ తో సత్సంబంధాలు మెరుగుపర్చేందుకు అనేక విధాల కృషి చేశారు. ఈ క్రమంలో అమెరికా, ఫ్రాన్స్, కెనడా, రష్యా, పాకిస్థాన్, శ్రీలంకతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా దేశాల నాయకులు మన్మోహన్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు.
आज कांग्रेस अध्यक्ष श्री @kharge ने प्रधानमंत्री जी और गृह मंत्री से फ़ोन पर बात करके व एक पत्र लिख कर भारतीय राष्ट्रीय कांग्रेस की ओर से पुरज़ोर अनुरोध किया कि भारत के सपूत सरदार मनमोहन सिंह जी का अंतिम संस्कार व स्मारक स्थापित करना ही उनको सच्ची श्रद्धांजलि होगी। pic.twitter.com/pNxh5txf0b
— Congress (@INCIndia) December 27, 2024