Pandit Kesharinath Tripathi: పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి కన్నుమూత.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం
2014 జూలై నుంచి 2019 జూలై వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పండిట్ కేశరినాథ్ త్రిపాఠి పనిచేశారు. అదేవిధంగా బీహార్, మేఘాలయ, మిజోరాం గర్నవర్‌గానూ పనిచేశారు. త్రిపాఠి మృతివార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. రాజ్యాంగ సబంధమైన విషయాల్లో ఆయనకు మంచి అవగాహన ఉండేదని, యూపీలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించారని, యూపీ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారని ప్రధాని కొనియాడారు.

Former Governor of West Bengal Keshari Nath Tripathi
Pandit Kesharinath Tripathi: బీజేపీ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి (88) ఆదివారం తెల్లవారు జామున 5గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా త్రిపాఠి అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతేడాది డిసెంబర్ 30న ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ నెల 4న ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగివచ్చారు. అయితే, ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం 4గంటలకు ప్రయాగ్‌రాజ్‌లోని రసూలాబాద్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Kesharinath Tripathi with Prime Minister Narendra Modi (File Photo)
పండిట్ కేశరి నాథ్ త్రిపాఠి 10 నవంబర్ 1934లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులకు ఏడుగురు సంతానంలో చివరి వ్యక్తి త్రిపాఠి. ఆయన అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అతను రచయిత, కవి కూడా. అనేక పుస్తకాలు రాశారు. త్రిపాఠి రాసిన ‘సంచయిత’ అందరి ప్రశంసలు అందుకుంది. త్రిపాఠి రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి. భారతీయ జనతా పార్టీ సభ్యుడు. యూపీ బీజేపీ అధ్యక్షుడిగానూ త్రిపాఠి పనిచేశారు. 1977-79లో జనతా పార్టీ ప్రభుత్వంలో కేసరినాథ్ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2024లో ఔన్‌పూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. 1991-1993 సంవత్సరాల్లో, 1997- 2022, మే 2022 నుంచి మార్చి 2044 వరకు యూపీ శాసనసభ స్పీకర్‌గా త్రిపాఠి పనిచేశారు.
वरिष्ठ राजनेता, भाजपा परिवार के वरिष्ठ सदस्य, प. बंगाल के पूर्व राज्यपाल आदरणीय केशरी नाथ त्रिपाठी जी का निधन अत्यंत दुःखद है।
प्रभु श्री राम दिवंगत पुण्यात्मा को अपने श्री चरणों में स्थान व शोकाकुल परिजनों को यह दुःख सहने की शक्ति दें।
ॐ शांति!
— Yogi Adityanath (@myogiadityanath) January 8, 2023
2014 జూలై నుంచి 2019 జూలై వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పండిట్ కేశరినాథ్ త్రిపాఠి పనిచేశారు. అదేవిధంగా బీహార్, మేఘాలయ, మిజోరాం గర్నవర్‌గానూ పనిచేశారు. త్రిపాఠి మృతివార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. రాజ్యాంగ సబంధమైన విషయాల్లో ఆయనకు మంచి అవగాహన ఉండేదని, యూపీలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించారని, యూపీ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారని ప్రధాని కొనియాడారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు త్రిపాఠి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.