రెండు కుటుంబాల్లో PubG చిచ్చు..కాల్పులు..నలుగురికి గాయాలు

  • Published By: madhu ,Published On : August 25, 2020 / 08:58 AM IST
రెండు కుటుంబాల్లో PubG చిచ్చు..కాల్పులు..నలుగురికి గాయాలు

Updated On : August 25, 2020 / 10:11 AM IST

PUBG GAME రెండు కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. ఆడుకుంటున్న యువకుల మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలి వానగా మారింది. రెండు కుటుంబాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. తుపాకులు ఎక్కు పెట్టారు. కాల్పులకు తెగబడ్డారు.



అంతేగాదు..కర్రలతో కొట్టుకున్నారు. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన యూపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
షమ్లీ జిల్లాలోని హసన్ పూర్ గ్రామంలో అమన్, విశాల్ యువకులు పబ్ జి గేమ్ ఆడుతున్నారు. వీరు గొడవపడ్డారు.



ఈ విషయం ఇంట్లో తెలిసింది. మాటా మాటా అనుకున్నారు. ఓ వర్గం తుపాకితో కాల్పులకు తెగబడింది. కర్రలు, దాడులకు పాల్పడ్డారు. గాయపడిన నలుగురిలో ఒకరికి బుల్లెట్ దిగనట్లు సమాచారం. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.