ఇవాళ్టి నుంచే అమలు : ఢిల్లీ బస్సుల్లో మహిళలకు నో టిక్కెట్

  • Published By: venkaiahnaidu ,Published On : October 29, 2019 / 04:56 AM IST
ఇవాళ్టి నుంచే అమలు : ఢిల్లీ బస్సుల్లో మహిళలకు నో టిక్కెట్

Updated On : October 29, 2019 / 4:56 AM IST

దేశరాజధానిలో మహిళల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ రైడ్ స్కీమ్ ఇవాళ(అక్టోబర్-29,2019)నుంచి అమలులోకి వచ్చింది. ఢిల్లీ మహిళలు ఇకపై DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆప్ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బస్సుల్లోని కండక్టర్లు జారీ చేసే సింగిల్ జర్నీ ఫ్రీ ట్రావెల్ పాస్ ఆధారంగా మహిళలు డీటీసీ,క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

కేజ్రీ నిర్ణయంపై ఢిల్లీ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో తిరిగే బస్సుల్లో మహిళలకు మరింత రక్షణ కల్పించేలా 13వేలకు పైగా మార్షల్స్ ను నియమించినట్లు సోమవారం సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలు, యువతులు తమ ఇంటిలో ఉన్నంత భద్రతగా ప్రభత్వ బస్సుల్లో ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. ఢిల్లీ నగరం ఓ పెద్ద కుటుంబంలాంటిదని, ఈ కుటుంబానికి తాను పెద్ద కొడుకునని, తల్లులు, అక్కచెల్లెళ్ల భద్రత తన బాధ్యత అని..అందుకే ప్రభుత్వానికి భారమైన ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్ తెలిపారు.

తల్లులు..అక్క చెల్లెళ్ల భద్రత ముందు ఈ ఖర్చు లెక్కలోది కాదని అన్నారు.  ఇటువంటి ఏర్పాటు ఎక్కడా లేదని అన్నారు. కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.