పెద్ద స్కెచ్ : భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్న చోక్సీ

  • Published By: venkaiahnaidu ,Published On : January 21, 2019 / 06:18 AM IST
పెద్ద స్కెచ్ : భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్న చోక్సీ

Updated On : January 21, 2019 / 6:18 AM IST

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) 14వేల కోట్ల స్కామ్ లో ప్రధాన నిందితుడు  ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ(59) తన భారత పౌరసత్వాన్ని వదులుకొన్నాడు. పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి రాకవడంతో ప్రధాన నిందితులు నీరవ్ మోడీ, ఆయన మామ మెహుల్ చోక్సీ దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దేశం విడిచి పారిపోయిన చోక్సీ ఆంటిగ్వా సిటిజన్ షిప్ పొందిన చోక్సీ అక్కడే ఉంటున్నాడు.

చోక్సీని భారత్ కు అప్పగించాలని ఓ వైపు  ఆంటిగ్వా ప్రభుత్వాన్ని భారత్ కోరుతున్న సమయంలో సోమవారం(జనవరి 21,2019)  తన భారత పౌరసత్వాన్ని వదులుకొంటూ ఆంటిగ్వా అధికారులకు తన భారతీయ పాస్ పోర్ట్ ని సరెండర్ చేశారు. తనను భారత్ రప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు చోక్సీ ఈ విధంగా చేసినట్లు అర్థమవుతోంది. ఆంటిగ్వాలోని ఇండియన్ హఐ కమీషన్ లో తన పాస్ పోర్టుతో పాటు 177 డాలర్లను కూడా చోక్సీ అధికారులకు అందజేశారు.  ఆంటిగ్వాలోని జాలీ హార్బర్ మార్క్స్ ని చోక్సీ తన కొత్త అడ్రస్ గా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 2018లో చోక్సీకి ఆంటిగ్వా, బార్బుడా దేశాల  పౌరసత్వం లభించింది. చోక్సీపై భారత్ లో ఈడీ, సీబీఐలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.