Tablighi Jamaat: స్పాన్సర్లపైనా.. వర్కర్లపైనా కేసులు, వీసాలు బ్లాక్ చేసిన ప్రభుత్వం

Tablighi Jamaat: స్పాన్సర్లపైనా.. వర్కర్లపైనా కేసులు, వీసాలు బ్లాక్ చేసిన ప్రభుత్వం

Updated On : April 3, 2020 / 2:03 PM IST

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను, రాష్ట్ర డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. తబ్లిగీ జమాత్ లో పాల్గొన్న 960 మంది విదేశీ వర్కర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆర్డర్ వేసింది. కొవిడ్ 19 పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో జమాత్ నిర్వహించి వందల సంఖ్యలో కరోనా పేషెంట్లు పెరగడానికి కారణమైనందుకు శిక్షించాలని నిర్ణయించారు. 
గురువారం అందులో పాల్గొన్న 960మంది విదేశీ వర్కర్ల వీసాలను బ్లాక్ లిస్టులో పెట్టింది. దాంతో ఇంకోసారి వారికి భారత్ కు రావాలంటే వీసా దొరకదు. 

వారంతా టూరిస్టు వీసాల మీద వచ్చి నిజాముద్దీన్ హెడ్ క్వార్టర్స్‌లో తబ్లిగీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పెరిగిన కరోనా కేసుల్లో 60శాతం ఈ జమాతే కారణం. భారత వీసా నియమాలను ఉల్లంఘించడంతో పాటు కొవిడ్ 19 మహమ్మారి వ్యాప్తికి కారణమయ్యారు. దీని ప్రకారం.. ఈ విదేశీయులు అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. పలు ఐపీసీ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదయ్యాయని హోం శాఖకు చెందిన ప్రతాప్ సింగ్ రావత్ అన్నారు. చట్ట ప్రకారం.. ఇలాంటి పనులకు పాల్పడ్డ వారిని కచ్చితంగా శిక్షించాలని ప్రభుత్వం కార్యచరణ మొదలుపెట్టింది. 

కరోనా వ్యాప్తి కాకుండా ప్రభుత్వం ముందుగానే పరిశ్రమలు ఆపేసి, ఆఫీసులు మూసేసి, విమానాలు, రైళ్లు రాకపోకలు నిలిపేసింది. కానీ, ఈ గ్రూపు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించారు. దాంతో పాటు తబ్లిగీ కోసం పనిచేసే సాధారణ వ్యక్తులు చట్ట ప్రకారం వ్యవహరిస్తే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోమనే విషయాన్ని స్పష్టం చేశారు. 

తబ్లిగీ జమాత్ ఏర్పాటు చేయాలని వచ్చిన విదేశీయుల వీసాలు రద్దు చేసి ఇక్కడే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. వారి కారణంగానే వందల సంఖ్యలో కరోనా మహమ్మారి బారిన పడ్డారని ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే దేశం దాటి వెళ్లిపోయిన 360 మంది తబ్లిగీ జమాత్ వర్కర్కలపై ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయమని.. వారిని తిరిగి భారతదేశంలో అడుగుపెట్టనివ్వబోమని స్పష్టం చేశారు. 

సెక్షన్ 269, సెక్షన్ 270 ప్రకారం.. 6నెలల జైలు శిక్ష, ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి సమయంలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ రెండేళ్ల జైలు శిక్ష విధించినున్నట్లు తెలిపారు. విదేశీయులు కూడా చట్టానికి అతీతులు కాదని వారికి అదే విధమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. 

Also Read | భారతదేశ ఆశలు చిన్నాభిన్నం.. 30ఏళ్ల దిగువకు జారిపోయిన వృద్ధిరేటు