G20 Summit live updates: రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన విందులో జీ20 దేశాల అధినేతలు
పలు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలి రోజు జీ20 సదస్సు ముగిసింది.

Delegations of the G20 nations
G20 Summit Delhi: ప్రపంచంలోని అనేక అగ్రరాజ్యాల అధినేతలు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. న్యూ ఢిల్లీలో జరుగుతున్న జీ20 తొలి రోజు సదస్సు ముగిసింది. జీ20 నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇచ్చారు.
LIVE NEWS & UPDATES
-
రాష్ట్రపతి విందు
జీ20 నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇచ్చారు. ఆమెను పలు దేశాల అధినేతలు కలిశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు.
#WATCH | G 20 in India | Australian Prime Minister Anthony Albanese and his partner Jodie Haydon arrive at the Bharat Mandapam in Delhi, for G 20 dinner hosted by President Droupadi Murmu pic.twitter.com/aiTYVpgmtB
— ANI (@ANI) September 9, 2023
-
కాసేపట్లో విందు
జీ20 దేశాల అధినేతలకు కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. న్యూ ఢిల్లీలో జరుగుతున్న జీ20 తొలి రోజు సదస్సు ముగియడంతో ఇవాళ రాత్రి 8 గంటలలోపు ఆయా దేశాల అధినేతలు విందు జరగనున్న భారత్ మండపానికి చేరుకుంటారు.
-
జీవ ఇంధన కూటమి ఏర్పాటు
న్యూ ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో పలు డిక్లరేషన్లు చేశారు. ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీనిపై సభ్యదేశాలన్నీ పనిచేయాలని, జీవ ఇంధనాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భారత్ సూచించింది. పెట్రోల్లో దాదాపు 20 శాతం ఇథనాల్ కలిపేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
-
తొలిరోజు ముగిసిన జీ20 చర్చలు
న్యూ ఢిల్లీలో జరుగుతున్న జీ20 తొలి రోజు సదస్సు ముగిసింది. ఇవాళ రాత్రి 8 గంటలకు జీ20 నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు.
-
బైడెన్, షేక్ హసీనా సెల్ఫీ
Joe Biden, Sheikh Hasina
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జీ20 సదస్సు వేదిక వద్ద సెల్ఫీ తీసుకున్నారు.
-
అక్షరధామం మందిరానికి రిషి..
యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ ఆదివారం ఢిల్లీలోని అక్షరధామం మందిరాన్ని దర్శించుకోనున్నారు. ఈ విషయంపై ఆయన ఇప్పటికే ప్రకటన చేశారు.
-
యూకే, జపాన్ ప్రధానులతో...
యూకే, జపాన్ ప్రధానులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మొదట యూకే ప్రధాని రిషి సునక్ తో సమావేశాలు నిర్వహించి, ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆ సమయంలో మోదీ, రిషి సునక్ హగ్ ఇచ్చుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాని కిషిదాతో మోదీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. యూకే, జపాన్‌తో భారత్ పలు ఒప్పందాలపై సంతకాలు చేసింది.
-
మనం కలిస్తే సవాళ్లను ఎదుర్కోవచ్చు.. బ్రిటన్ ప్రధాని
ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడానికి 15 సంవత్సరాల క్రితం G20 నాయకులు మొదటిసారి కలిసి వచ్చారని బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచం అపారమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో మేము కలుస్తాము, నాయకత్వాన్ని అందించడానికి ప్రపంచం మరోసారి G20 వైపు చూస్తుంది. మనం కలిసి ఈ సవాళ్లను ఎదుర్కోగలమని నేను నమ్ముతున్నాను’’ అని అన్నారు.
-
ప్రధాని మోదీ, మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే వ్యూహాత్మక భాగస్వామ్య మండలి మొదటి నాయకత్వ స్థాయి సమావేశానికి సహ-అధ్యక్షుడుగా కూడా వ్యవహరించనున్నారు.
-
రాష్ట్రపతి విందుకు సిద్ధంగా ఉన్న ప్రత్యేక వంటకాల జాబితా
జీ20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో గులాబ్ జామూన్, రస్మలై, జిలేబీ వంటి స్వీట్లను ఉన్నట్లు PTI పేర్కొంది. ఈ విందు కోసం ఏర్పాటు చేసిన ఆహార జాబితాలో భారతదేశంలో వర్షాకాలంలో తినే వంటకాలు ఉన్నాయి. ప్రత్యేకంగా తయారు చేసిన వెండి పాత్రల్లో ఆహారాన్ని అందించనున్నారు. 200 మంది నైపుణ్యులు దాదాపు 15,000 వెండి పాత్రలను ఈ సమావేశం కోసం సిద్ధం చేశారు.
-
రాష్ట్రపతి విందుకు మాజీ ప్రధానులిద్దరూ హాజరుకావడం లేదట
మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడ 'అనారోగ్య కారణాల' వల్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే జీ20 విందుకు హాజరుకావడం లేదట. మాజీ ప్రధానులు, ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతరులను ఈ గ్రాండ్ డిన్నర్‌కు ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మన్మోహన్, దేవెగౌడ ఇద్దరూ విందుకు హాజరు కాలేకపోవడంపై కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు.
-
G20కి భారతదేశ నాయకత్వం ప్రపంచ ఐక్యతకు చిహ్నం.. ప్రధాని మోదీ
జీ20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో, "G20కి భారతదేశం అధ్యక్షత వహించడం దేశం లోపల, వెలుపల అందరినీ కలుపుకుపోవడానికి, ఐక్యతకు చిహ్నంగా మారింది. ఇది ప్రజల కోసం మారింది. కోట్లాది మంది భారతీయులు జీ20తో అనుబంధం కలిగి ఉన్నారు. దేశంలో 60కి పైగా నగరాల్లో 200కు పైగా సమావేశాలు జరిగాయి. సబ్కా సాథ్ స్ఫూర్తితో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని భారత్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు మనమందరం అంగీకరిస్తామని నేను నమ్ముతున్నాను" అని అన్నారు.
-
భద్రతావలయంలో ఢిల్లీ
జీ20 సమావేశాల సందర్భంగా శనివారం, ఆదివారం సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రగతి మైదాన్, కర్తవ్యపథ్, ఇండియాగేట్ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై నిషేధం విధించారు. సెంట్రల్ సిటీలో బస్సులు, ట్యాక్సీ సర్వీసులపైనా కూడా ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీలో నివసించేవారికి మినహా మరెవరినీ లోపలికి బయటికి అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు, పటేల్ చౌక్, ఆర్కే ఆశ్రమ్ మార్గ్ మెట్రో స్టేషన్లలో 4 రోజుల పాటు పార్కింగ్ నిషేధించారు. ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలు వదిలి మెట్రో రైళ్లనే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు.
సెంట్రల్ ఢిల్లీలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, మద్యం దుకాణాలు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించడంతో అవన్నీ మూతపడ్డాయి. జీ 20 భద్రతా విధుల్లో 1.3 లక్షల మంది పోలీస్, పారామిలటరీ సిబ్బంది
ఉన్నారు. నగరంలో అడుగడుగునా సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వినియోగిస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా అనుమానితులను పసిగట్టేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి 160కి పైగా దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దేశాధినేతల విమానాలు మినహా చార్టర్డ్ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. ఇక 207 రైళ్లను రద్దు చేయగా, మరో 36 రైళ్లను దారిమళ్లించారు.
-
అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన సమయం ఇదే.. ప్రధాని మోదీ
ఢిల్లీలో జరిగిన G20 సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ, కోవిడ్-19 తర్వాత, విశ్వాసం లేకపోవడం వల్ల ప్రపంచంలో పెద్ద సంక్షోభం వచ్చిందని అన్నారు. యుద్ధం విశ్వాస లోటును మరింతగా పెంచిందని.. మనం కోవిడ్‌ను ఓడించగలిగినప్పుడు, పరస్పర అపనమ్మకం రూపంలో వచ్చిన సంక్షోభాన్ని కూడా మనం ఓడించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. మనం కలిసి ప్రపంచ విశ్వాస లోటును విశ్వసనీయంగా మారుద్దామని అన్నారు. అందరూ కలిసికట్టుగా కదలాల్సిన సమయం ఇదని.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రం మనందరికీ మార్గదర్శకం కాగలదని పేర్కొన్నారు. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ దేశం లోపల మరియు వెలుపల చేరిక యొక్క సబ్కా సాథ్ యొక్క చిహ్నంగా మారిందని మోదీ అన్నారు.
-
ఇక నుంచి జీ20ని జీ21గా పిలవాలి
ఇక నుంచి జీ20ని జీ21గా పిలుస్తున్నారు. కారణం, ఈ కూటమిలో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వం పొందింది. భారతదేశం గ్లోబల్ సౌత్ నాయకత్వంలో స్థిరపడింది. ఆఫ్రికన్ యూనియన్‌లో 55 దేశాలు ఉన్నాయి. ‘‘ఆఫ్రికన్ యూనియన్‌కు జి20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని మేము ప్రతిపాదించాము. మీరందరూ దీనితో ఏకీభవిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ అందరి సమ్మతితో తదుపరి చర్యను ప్రారంభించడానికి ముందు, నేను ఆఫ్రికన్ యూనియన్‌ను సభ్యునిగా ఆహ్వానిస్తున్నాను’’ ప్రధాని మోదీ అన్నారు.
-
వినూత్నంగా యూపీఐ ప్రచారం
జీ20లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ అతిథులందరి మొబైల్ వాలెట్లలో ప్రభుత్వం కొంత డబ్బును డిపాజిట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. ఇది UPI చెల్లింపు, దీనిలో ప్రజలు డిజిటల్ మాధ్యమం ద్వారా ఏదైనా కొనుగోలు కోసం చెల్లింపు కోసం వేశారట. ఈ విధంగా ప్రపంచ దేశాల మధ్య UPI ప్రచారం నిర్వహిస్తున్నారు.