భారత జవాన్లపై కర్కశం…సరిహద్దు ఘర్షణలో చైనా ఉపయోగించిన ఆయుధాలు ఇవే

  • Published By: venkaiahnaidu ,Published On : June 18, 2020 / 01:10 PM IST
భారత జవాన్లపై కర్కశం…సరిహద్దు ఘర్షణలో చైనా ఉపయోగించిన ఆయుధాలు ఇవే

Updated On : June 18, 2020 / 1:10 PM IST

తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో రెండు రోజుల క్రితం  భారత సైనికులపై డ్రాగన్‌ ఆ‍ర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసులుబాసిన విషయం తెలిసిందే.  అయితే మన జవాన్లపై దాడికి చైనా లాంటి తుపాకులు ఉపయోగించకుండా.. ఇసుక రాడ్లు, మారణాయుధాలతో దాడి చేసి అత్యంత కాఠిన్యం ప్రదర్శించింది.

సోమవారం రాత్రి గల్వాన్ లోయలో ఇరు వర్గాల మధ్య దాడి జరిగిన ప్రాంతంలో చైనా సైనికులు వాడిన ఇసుప రాడ్లు లభ్యమయ్యాయి. బలమైన రాడ్లకు కొండీలు అమర్చి వాటిని  భారత సైనికులపై దాడి చేసేందుకు ఆయుధంగా ఉపయోగించింది చైనా ఆర్మీ. మేకులు  గుచ్చిన ఇనుప రాడ్ లతో దాడి చేయడం మూలంగానే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని  సైనిక వర్గాలు భావిస్తున్నాయి.

సరిహద్దు దేశాలపై నిత్యం దురాక్రమణకు పాల్పడే జిత్తులమారి చైనా ప్రత్యర్థి సైన్యంపై ఎప్పుడూ కఠిన వైఖరినే అవలంభిస్తుంది. ఐదు శతాబ్ధాలకు పైగా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుతున్న భారత సైనికులపై డ్రాగన్‌ ఆ‍ర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడింది. ఉద్దేశపూర్వకంగా కయ్యానికి కాలుదువ్విన చైనా దుస్సాహసాన్ని భారత జవాన్లు పసిగట్టలేకపోయారు.

 గతకొంత కాలంగా సరిహద్దుల్లో గిల్లికజ్జాలు ఆడుతున్న ‘రెడ్‌ ఆర్మీ’ దొంగదెబ్బ తీయాలని అదునుచూసి ఘర్షణకు దిగింది. దాడికి ఎలాంటి ప్రణాళిలకు లేకపోయినప్పటికీ.. భారత ఆర్మీ చైనా బలగాలను బలంగా తిప్పిగొట్టగలిగారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. కాగా సరిహద్దుల్లో సమస్య సమసిపోయే విధంగా భారత్‌-చైనా చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు సరిహద్దు వివాదంపై చర్చించేందుకు గురువారం సమావేశమైనట్లు సైనిక వర్గాలు తెలిపాయి.