Rahul Gandhi: గాంధీలు భయపడరు.. గళమెత్తిన కాంగ్రెస్

మనీలాండరింగ్ కేసును ప్రస్తావిస్తూ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో రాహుల్ గాంధీ విచారణకు ఒకరోజు ముందుగా పలువురు సీనియర్ నాయకులు, ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.

Rahul Gandhi: గాంధీలు భయపడరు.. గళమెత్తిన కాంగ్రెస్

Rahul Gandhi

Updated On : June 13, 2022 / 7:31 AM IST

Rahul Gandhi: మనీలాండరింగ్ కేసును ప్రస్తావిస్తూ బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో రాహుల్ గాంధీ విచారణకు ఒకరోజు ముందుగా పలువురు సీనియర్ నాయకులు, ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. తమ పార్టీ మాజీ అధినేత వెనక్కి తగ్గరని పేర్కొన్నారు.

“రాహుల్ గాంధీ ED నోటీసులకు, అహంకారానికి భయపడరు” అని కాంగ్రెస్ ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్య “నిరాధారమైనది” అని కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం పేర్కొన్నారు. ED అధికార పరిధి బీజేపీ సభ్యులకు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు విస్తరించదని ఆరోపించారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన చిదంబరం.. “పర్సు లేనప్పుడు పర్సు లాక్కున్నాడని ఆరోపించడం లాంటిదని” అభివర్ణించారు.

Read Also: ఈడీ ఆఫీసుల ముందు రేపు కాంగ్రెస్ నిరసన

లక్నోలో సచిన్ పైలట్, రాయ్‌పూర్‌లో వివేక్ తంఖా, భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్, సిమ్లాలో సంజయ్ నిరుపమ్, చండీగఢ్‌లో రంజీత్ రంజన్, అహ్మదాబాద్‌లో పవన్ ఖేరా, డెహ్రాడూన్‌లో అల్కా లాంబా రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతూ మీడియా సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్ బల నిరూపణలో పాల్గొన్న వారు, పలు రాష్ట్రాల్లోని ED ప్రధాన కార్యాలయాలకు నాయకులంతా సోమవారం పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే ఇది అంటూ ఆరోపించారు.

రాహుల్‌గాంధీకి ప్రశ్నలు అడిగే ధైర్యం ఉండడం వల్లే బీజేపీ భయపడుతోందని అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు.

ఈడీ సమన్లు ​​ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి కేంద్రం పన్నుతున్న వ్యూహంలో భాగమని రాజ్యసభ ఎంపీ రంజిత్ రంజన్ ఆరోపించారు.

సిమ్లాలో, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ నిరుపమ్, నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఇతర కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.