కూతుళ్ల పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్న గౌతమ్ గంభీర్

భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల మన్ననలు పొందుతోంది. అంతా గంభీర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : October 8, 2019 / 10:23 AM IST
కూతుళ్ల పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్న గౌతమ్ గంభీర్

Updated On : October 8, 2019 / 10:23 AM IST

భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల మన్ననలు పొందుతోంది. అంతా గంభీర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల మన్ననలు పొందుతోంది. అంతా గంభీర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తండ్రి ప్రేమకు నిదర్శనం అంటున్నారు. ఇంతకీ ఆ పిక్ లో ఏముందంటే.. తన కూతుళ్ల కాళ్లను గంభీర్ కడిగాడు. అంతేకాదు వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. ఇదంతా ఆచారంలో ఓ భాగం. అష్టమి కంజక్ అనే ఆచారం ఉంది. అందులో భాగంగా కూతుళ్ల పాదాలను తండ్రులు కడుగుతారు. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పుడు గంభీర్ కూడా అదే పని చేశాడు. దసరా పండుగలో ఈ ఆచారం ఓ భాగం. 

”ఇద్దరు కూతుళ్ల తండ్రిగా ఇది నా బాధ్యత. కూతుళ్ల కాళ్లను కడుతాను. నా పెడిక్యూర్ స్కిల్స్ మెరుగు పరుచుకుంటాను. అదే సమయంలో వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటాను. ఈ సర్వీస్ చేసినందుకు బిల్లు ఎక్కడికి పంపాలి” అని సరదాగా అడుగుతూ గంభీర్ ట్వీట్ చేశాడు. గంభీర్ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2018 డిసెంబర్ లో గంభీర్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బీజేపీ తరఫున ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసి ఎంపీ అయ్యాడు.