Meteor Shower : ఐదురోజులు ఆకాశంలో అద్భుతం.. భూమిపైకి రాలే ఉల్కాపాతాలను నేరుగా చూడొచ్చు.. ఎలానో తెలుసా?

పాథియన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొద్ది నెలల క్రితం భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఇది కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్నచిన్న ఉల్కలుగా రాలిపడుతుంది.

Meteor Shower : ఐదురోజులు ఆకాశంలో అద్భుతం.. భూమిపైకి రాలే ఉల్కాపాతాలను నేరుగా చూడొచ్చు.. ఎలానో తెలుసా?

Meteor Shower

Updated On : December 16, 2023 / 9:58 AM IST

Hyderabad : ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా ఐదు రోజుల పాటు ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. అదీ కేవలం రాత్రి వేళల్లో మాత్రమే. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆకాశం నుంచి భూమిపైకి ఉల్కాపాతాలను దూసుకురానున్నాయి. భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా వీక్షించొచ్చు. డిసెంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు రాత్రి 9గంటల నుంచి తెల్లవారు జామున ఐదు గంటల వరకూ వేరువేరు సమయాల్లో కాంతివంతమైన ఉల్కాపాతాలు కనిపించనున్నాయి.

Meteor Shower

ఇలా ఎందుకు జరుగుతుంది..
పాథియన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొద్ది నెలల క్రితం భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఇది కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్నచిన్న ఉల్కలుగా రాలిపడుతుంది. ఈ క్రమంలో ఇవి గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ (ఐఎంఓ) వెబ్ సైట్లో తెలిపింది. నాసా ప్రకారం.. ఫేథాన్, తోకచుక్క వలె పనిచేస్తుంది. ప్రతి 1.4 సంవత్సరాలకు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమిమీదకు రాలే ఉల్కలు సెకనుకు 21 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే, భారతదేశంలో ఈ ఉల్కాపాతం ప్రకాశవంతమైన పసుపు, తెలుపు, ఆకుపచ్చ వంటి శక్తివంతమైన రంగులను కలిగి ఉండే బాణాసంచా ప్రదర్శనను పోలి ఉంటుంది. ఈ శిథిలాలు భూమి వాతావరణాన్ని తాకినప్పుడు అవి కాలిపోతాయి ఆ సమయంలో అద్భుతమైన కాంతి చారలను సృష్టిస్తుంది.

Meteor Shower

వీటిని వీక్షించడం ఎలా..
ఆకాశం నుంచి భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడొచ్చు. ఇవి ఎక్కడైనా చూడొచ్చు.. అంటే.. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ ఈ ఉల్కాపాతాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వీటిని దగ్గరగా చూడాలనుకునే వారు బైనాక్యూలర్ లు, చిన్న టెలిస్కోప్ లను ఉపయోగించి చూడొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం .. మీరు ఉత్తమ వీక్షణ అనుభవంకోసం సాధ్యమైనంత చీకటిగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.