Ghost Pairing: ఘోస్ట్ పెయిరింగ్.. కలవరపెడుతున్న కొత్త సైబర్ స్కామ్.. స్కామర్లు ఎలా మోసం చేస్తారంటే..

Hey I Just Found Your Photo లాంటి సందేశంతో ఈ స్కామ్ మొదలవుతుంది.

Ghost Pairing: ఘోస్ట్ పెయిరింగ్.. కలవరపెడుతున్న కొత్త సైబర్ స్కామ్.. స్కామర్లు ఎలా మోసం చేస్తారంటే..

Updated On : December 21, 2025 / 5:51 PM IST

Ghost Pairing: మీకు తెలిసిన వారి నెంబర్ల నుంచి మెసేజ్ లు, లింకులు వస్తున్నాయా? ఎందుకైనా మంచిది ఒకసారి రీ చెక్ చేసుకోండి. సైబర్ నేరగాళ్లు మనకు తెలిసిన కాంటాక్ట్ ల నుంచి మన డివైజస్ లోకి చొరబడుతున్నారు. ఇందుకు వాట్సాప్ సందేశాలను ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త తరహా మోసం పేరే ఘోస్ట్ పెయిరింగ్. లింక్డ్ డివైజస్ ఫీచర్ ను దుర్వినియోగం చేసి యూజర్ ఖాతాలోకి చొరబడుతున్న స్కామర్స్ మన అకౌంట్ లోని డబ్బును ఖాళీ చేసేయొచ్చు. పాస్ వర్డ్స్, వెరిఫికేషన్ కోడ్స్, సిమ్ కార్డ్స్ లాంటి వివరాలేవీ చెప్పకపోయినా దొడ్డిదారిలో స్కామర్లు మన ఫోన్ ను హ్యాక్ చేసి దోచేస్తున్నారు.

ఘోస్ట్ పెయిరింగ్.. ఇదో పెద్ద సైబర్ థ్రెట్. వాట్సాప్ లో తెలిసిన కాంటాక్ట్ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ను కానీ లింక్ ను కానీ ఫాలో అయ్యారో అంతే సంగతులు. ఘోస్ట్ పెయిరింగ్.. ఇప్పుడీ సైబర్ థ్రెట్ అందరినీ కలవర పెడుతోంది. యూజర్ వాట్సాప్ మోసపూరిత డివైజ్ తో అనుసంధానం అయ్యేలా స్కామర్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మోసాన్ని గుర్తించడం కష్టం. మనకు తెలిసిన కాంటాక్ట్ ల నుంచి మెసేజ్ వస్తుంది.

Hey I Just Found Your Photo లాంటి సందేశంతో ఈ స్కామ్ మొదలవుతుంది. ఇందులో ఒక లింక్ ఉంటుంది. ఇది ఫేస్ బుక్ ఫోటో వ్యూయర్ ను తలపించేలా నకిలీ వెబ్ పేజ్ ను డిస్ ప్లే చేస్తుంది. ఇందులోని కంటెంట్ ను చూడాలంటే వెరిఫికేషన్ అడుగుతారు. దీన్ని ఓకే చేస్తే ఇక్కడి నుంచే స్కామర్లు మనల్ని బురిడీ కొట్టించడం స్టార్ట్ చేస్తారు. మనం ఒక్కో స్టెప్ వెళ్తున్న కొద్దీ బ్యాక్ గ్రౌండ్ లో డివైజ్ పెయిరింగ్ మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఒక ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయాలన్న రిక్వెస్ట్ కూడా వస్తుంది. దాని తర్వాత న్యూమరిక్ పెయిరింగ్ కోడ్ ను వాట్సాప్ జనరేట్ చేస్తుంది.

ఈ కోడ్ ను వాట్సాప్ లో ఎంటర్ చేయాలని నకిలీ పేజీలో ఒక సూచన కనిపిస్తుంది. ఇదంతా సెక్యూరిటీ స్క్రూటీనిలో భాగం అని చెబుతుంది. ఆ కోడ్ ను ఎంటర్ చేయగానే మనకు తెలియకుండానే స్కామర్ మన డివైజ్ తో లింక్ అవుతారు. వాట్సాప్ వెబ్ యాక్సెస్ మొత్తం హ్యాకర్ చేతికి వెళ్తుంది. మన మెసేజ్ లన్నీ చదువుతాడు. మనం పంపినట్లే ఇతరులకు మెసేజ్ లు పంపుతాడు.

ఈ ఘోస్ట్ పెయిరింగ్ ను మొదట చెక్ రిపబ్లిక్ లో గుర్తించారు. ఇప్పటికే హ్యాకర్ల చేతిలో చిక్కిన ఖాతాలను ఉపయోగించి కాంటాక్టులు, గ్రూప్ చాట్ లకు ఈ మోసపూరిత లింకులను పంపే ఛాన్స్ ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లింక్ అయిన డివైజ్ ను యూజర్ మ్యానువల్ గా తొలగించే వరకు అది యాక్టివ్ గానే ఉంటుంది.

ఎప్పటికప్పుడు లింక్డ్ డివైజస్ ఆప్షన్ ను పరిశీలించుకోవాలి..

ఘోస్ట్ పెయిరింగ్ కేసుల్లో సాఫ్ట్ వేర్ లోపాలకంటే మనుషుల విశ్వాసం, భయం, అవసరం వంటి సైకలాజికల్ ప్రవర్తలను హ్యాకర్ గుర్తించి అటాక్స్ చేస్తాడు. ఇలాంటి స్కామ్ లకు చిక్కకూడదు అంటే ఎప్పటికప్పుడు వాట్సాప్ లోని సెట్టింగ్స్ కు వెళ్లి లింక్డ్ డివైజస్ ఆప్షన్ ను పరిశీలించుకోవాలి. ఏవైనా తెలియని డివైజ్ లు లింక్ అయ్యి ఉన్నాయేమో గమనించుకోవాలి. స్కాన్ క్యూఆర్ కోడ్ లేక ఎంటర్ పెయిరింగ్ కోడ్స్ వంటి అభ్యర్థనలపై అప్రమ్తతంగా ఉండాలి. తెలిసిన కాంటాక్ట్ ల నుంచి వచ్చిన సందేశాలే అయినా జాగ్రత్తగా ధృవీకరించుకోవాలి. అలాగే అదనపు భద్రత కోసం 2 స్టెప్ వెరిఫికేషన్ ను ఎనేబుల్ చేసుకోవాలి.

ఆ లింక్స్ పై క్లిక్ చేయొద్దు..

ఘోస్ట్ పెయిరింగ్ థ్రెట్ పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. జాగ్రత్తగా ఉండాలని మొబైల్ యూజర్లను హెచ్చరించారు. వాట్సాప్‌లో ఘోస్ట్ పెయిరింగ్ పేరుతో కొత్త స్కామ్ జరుగుతోందని సజ్జనార్ తెలిపారు. ‘Hey.. మీ ఫొటో చూశారా? అంటూ లింక్‌ వస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లింక్ పై
చేయొద్దని కోరారు. పొరపాటున ఆ లింక్ పై క్లిక్ చేస్తే హ్యాకర్ల డివైజ్‌కు మీ అకౌంట్ కనెక్టవుతుందన్నారు. ఇక, అంతే.. మీ పర్సనల్ డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుందని, మీ పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపి మోసం చేస్తారని వివరించారు. ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే.. వాట్సాప్ సెట్టింగ్స్‌లో ‘Linked Devices’ ఆప్షన్‌ను చెక్ చేసి తెలియని డివైజ్‌లు ఉంటే రిమూవ్‌ చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.