కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త!

  • Published By: Mahesh ,Published On : August 21, 2019 / 04:33 AM IST
కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త!

Updated On : August 21, 2019 / 4:33 AM IST

కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే కేబుల్, డీటీహెచ్ చార్జీలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. చానెల్ ప్రైసింగ్, బొకే ప్రైసింగ్ సహా చార్జీలన్నింటినీ సమీక్షించాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది.

కొత్త విధానం ప్రవేశపెట్టినప్పుడు కొన్ని కారణాలతో ఎక్కువ రేట్లు ఉన్నాయని, ఇప్పడు పరిస్థితులు మారాయి కాబట్టి సమీక్ష తప్పదని ట్రాయ్ కంపెనీలకు వెల్లడించింది. సెప్టెంబర్ 16లోగా ధరలు తగ్గింపుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. అందుకు సంబందించి ప్రతిపాదనలు వెల్లడించాలని టెలికాం సంస్థలకు ట్రాయ్ గడువు పెట్టింది