మద్యం ప్రియుళ్లకు శుభవార్త

మద్యం ప్రియుళ్లకు ఊరటనిచ్చే వార్త ఇది. లిక్కర్ షాపులు బంద్ చేయడం లేదు. పైగా వైన్ షాపులకు ఎవరు వెళుతారు..ఒక్క క్లిక్ తో మద్యం ఇంటికి వస్తే..ఎంత బాగుండే..అని అనుకుంటున్న వారి కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఆన్ లైన్ లోనే మద్యం కొనుగోళ్లు చేసుకోవచ్చు. అబ్బా..ఎంత మంచి ఛాన్స్.. చాలా రోజులు అయిపోయాయి..నోరంతా ఏదోలా ఉంది..ఛలో వైన్ షాప్స్ అని అనుకుంటున్నారు. తెలంగాణ, ఏపీలో కాదు. కేరళ రాష్ట్రంలో.
మద్యం దొరక్క ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో కేరళ ప్రభుత్వం 2020, మార్చి 30వ తేదీ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ ప్రిస్కిప్సన్ తో మద్యం అందించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు.
ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు మద్యాన్ని మాని వేయాలని అనుకుంటున్న వారికి ఉచితంగానే శస్త్ర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీ అడిక్షన్ సెంటర్ లో చేరిపించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read | వంటలక్క.. డాక్టర్ బాబు కలవడం చూడాలని లేదా?