గుడ్ న్యూస్ : స్టాట్యూ ఆఫ్ యూనిటీకి స్పెషల్ ట్రైన్

ఢిల్లీ : స్టాట్యూ ఆఫ్ యూనిటీ. వేలకోట్ల రూపాయల ఖర్చుతో గుజరాత్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఈ గ్రేట్ స్టాట్యూని చూడాలనుకునేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సందర్శకుల కోసం ప్రత్యేక రైలును నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఐదు నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శకుల కోసం ఈ ప్రత్యేక రైలును మార్చి 4న ప్రారంభించనున్నారు.
భారత్ దర్శన్ టూర్ స్కీం కింద 8 రోజుల పర్యటన ప్యాకేజీపై ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఈ ప్రత్యేక రైలును నడపనుంది. చండీఘడ్ నుంచి ప్రారంభమై ఉజ్జయినిలోని పుణ్యక్షేత్రాలైన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ, ఇండోర్ లోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగ, షిర్డీ సాయిబాబా దర్శన్,నాసిక్ లోని త్రయంబకేశ్వర్, ఔరంగాబాద్ ల మీదుగా ఈ యాత్ర సాగనుంది. చండీఘడ్ తోపాటు అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, ఢిల్లీ కంటోన్మెంటు, రేవారి, అల్వార్, జైపూర్ లమీదుగా సాగే ఈ యాత్ర ప్రత్యేక రైలు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం సందర్శనతో ముగుస్తుంది.
గుజరాత్ లోని నర్మద డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ గ్రేట్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని సందర్శనకు వీలుగా ఈ ప్రత్యేక రైలును నడపనున్నారు. దీని కోసం ప్రయాణీకుడికి రూ.7,560 అవుతుంది. ఈ ప్యాకేజీలో డార్మిటరీ వసతితోపాటు శాకాహార భోజనం కూడా పర్యాటకులకు అందించ ఏర్పాట్లు కూడా అందుబాటులో ఉంటాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది.