Aeroplane Emergency Landing : స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గోరఖ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్లేన్ టేకాఫ్ అయిన కొద్దీ సేపటికే మహిళ అస్వస్థతకు గురైంది.

Aeroplane Emergency Landing
Aeroplane Emergency Landing : గోరఖ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం మధ్యాహ్నం 182 మంది ప్రయాణికులతో బయలుదేరింది విమానం.. ప్రయాణికుల్లో మూడు నెలల గర్భవతి కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆమె అస్వస్థతకు గురైంది. వాంతులు, కళ్ళు తిరిగినట్లుగా ఉండటంతో విమానం సిబ్బందికి సమాచారం ఇచ్చింది. వారు మెడికల్ ఎమెర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి అడిగారు.
ఈ క్రమంలోనే నాగపూర్ విమానాశ్రయ సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి అనుమతించారు. 12.32 గంటలకు నాగ్‌పూర్‌లో విమానం అత్యవసరంగా దింగింది. ఆమెను హుటాహుటిన దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ సునీల్ సంగోలే తెలిపారు. ప్రస్తుతం మహిళా ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని.. ఆమె చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయి నాగపూర్ లోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఇక విమానం సాయంత్రం 5.17 నిమిషాలకు ముంబై చేరుకుంది.
చదవండి : TN Chopper Crash: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరో ఆరుగురి మృతదేహాలు గుర్తింపు