దేశీయ విమాన సర్వీసులు పెంచిన కేంద్రం

  • Published By: venkaiahnaidu ,Published On : December 3, 2020 / 09:52 PM IST
దేశీయ విమాన సర్వీసులు పెంచిన కేంద్రం

Updated On : December 4, 2020 / 6:07 AM IST

Government allows 10% more domestic flights కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ తో స్తంభించిపోయిన ప్రజల జీవన వ్యవస్థ అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇస్తుండటంతో మళ్లీ సాధారణ స్థితికి అడుగులు వేస్తోంది. దీంతో అన్నిరంగాలు మెల్లగా పుంజుకుంటుంన్నాయి. ప్రజా రవాణా సైతం మళ్లీ పరుగులు పెడుతోంది.



ఈ క్రమంలో ఇప్పటివరకు పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండగా రానురానూ ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో విమానాల రాకపోకలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశీయ విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త అందించింది.



దేశీయంగా తిరిగే విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతున్నట్లు గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పురి తెలిపారు. ఇప్పటివరకు 70శాతంగా తిరుగుతున్న విమానాలను 80శాతంకు పెంచుతున్నట్లు తెలిపారు. దీంతో మరిన్ని విమానయాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.



కాగా, దాదాపు రెండు నెలల బ్యాన్ తర్వాత తిరిగి మే 25 నుంచి 30 వేలమంది ప్రయాణికులతో ప్రారంభమైన దేశీయ కార్యకలాపాలు నవంబర్​ 30 నాటికి 2.52 లక్షల గరిష్ఠాన్ని తాకినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పురి తెలిపారు.



కాగా కరోనా వైరస్ పరిస్థితుల్లోని డిమాండ్‌ కారణంగా భారత విమానయాన సంస్థలు తమ ప్రీ-కోవిడ్ దేశీయ ప్రయాణీకుల విమానాలలో 70 శాతం వరకు నడపవచ్చని నవంబర్ 11న మంత్రి తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఖ్యను మరింత పెంచడంతో మరిన్ని విమానయాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.