క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం సేవ చేస్తున్న వారికోసం కేంద్రం కొత్త పథకం

ప్రస్తుతం దేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి భయం నెలకొంది. ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ మహమ్మారి దాడి చేస్తుందో

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 07:55 AM IST
క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం సేవ చేస్తున్న వారికోసం కేంద్రం కొత్త పథకం

Updated On : April 20, 2020 / 7:55 AM IST

ప్రస్తుతం దేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి భయం నెలకొంది. ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ మహమ్మారి దాడి చేస్తుందో

ప్రస్తుతం దేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి భయం నెలకొంది. ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ మహమ్మారి దాడి చేస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇలాంటి క్లిష్ట, విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని రంగాలకు చెందిన కార్మికులు ఎంతో ధైర్యంగా ప్రాణాలను పణంగా పెట్టి తమ విధులు నిర్వహిస్తున్నారు. దేశానికి సేవ చేస్తున్నారు. అలాంటి వారికి అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓ కొత్త పథకం తీసుకొచ్చి వారికి ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. 

ముఖ్యంగా చెత్త సేకరించే కార్మికులు, వ్యవసాయ కూలీలు, నిత్యవసర సరుకులు రవాణ చేసే వారి కోసం ఈ ఎక్స్ గ్రేషియా పథకాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిన విధుల్లోకి తీసుకున్న వారికి ఈ ప్రయోజనం కల్పించాలన్నది కేంద్రం ఉద్దేశం. రెగులర్ గా జీతాలు లేని వారి కోసం, సామాజిక భద్రత లేని వారికి అండగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. 

విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ అందిస్తున్న హెల్త్ వర్కర్లకు ఇప్పటికే కేంద్రం.. బీమా పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా చెత్త సేకరించే వారికి, వ్యవసాయ కూలీలకు, నిత్యవసరాలు రవాణ చేసే వారికి ఏదో ఒక విధంగా సాయం చేయాలని కేంద్రం భావిస్తోంది. స్వీపర్లు, శానిటేషన్ వర్కర్స్, రైల్వే ర్యాక్స్, గూడ్స్ వెహికల్స్ లో లోడింగ్ అన్ లోడింగ్ చేసే కూలీల కోసం ఈ పథకం తీసుకురానుంది. అత్యవసర విభాగాల్లో పని చేసే వారిలో ఒక నమ్మకం, భరోసా కల్పించడం తమ లక్ష్యం అని ప్రభుత్వం చెప్పింది. అలాగే వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చినట్టు అవుతుందన్నారు. ఈ స్కీమ్ రూపకల్పనకు మూడు మంత్రిత్వ శాఖలు పని చేస్తున్నాయి. త్వరలోనే ఈ స్కీమ్ ను ప్రకటించే అవకాశం ఉంది.