strange wedding procession : జెసిబిలో పెళ్లిమండపానికి వచ్చిన పెళ్లికొడుకు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

పెళ్లిళ్లలో ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారికి కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటి ప్రకారం నిర్వహిస్తుంటారు. ఒడిశాలో ఓ పెళ్లికొడుకు పెళ్లిమండపానికి జెసిబిలో వచ్చాడు. ఇదేం సంప్రదాయం అనుకోకండి. అతను ఎందుకు అలా వచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

strange wedding procession : జెసిబిలో పెళ్లిమండపానికి వచ్చిన పెళ్లికొడుకు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

 strange wedding procession

Updated On : May 4, 2023 / 3:32 PM IST

strange wedding procession :  పెళ్లికొడుకును అందంగా అలంకరించిన కారులోనో, పల్లకిలోనో పెళ్లిమండపానికి ఊరేగింపుగా తీసుకు వస్తారు. ఒడిశాలో ఓ పెళ్లికొడుకు జెసిబిపై పెళ్లి మండపానికి వచ్చాడు. అయ్యో ఏమైంది? అనుకుంటున్నారు కదా.. చదవండి.

Wedding Card : ‘పెళ్లికి రావడం మర్చిపోండి’.. వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసి షాకైన అతిథులు

వివాహ వేడుకలో పెళ్లి మండపానికి వచ్చే వధూవరుల్ని ఎంతో సందడిగా తీసుకు వస్తారు. మేళతాళాలు, డ్యాన్స్ లు ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారు చేస్తుంటారు. అయితే ఒడిశాలోని నయాగర్ జిల్లాలోని ఖండపద బ్లాక్ కియాఝరా గ్రామంలో పెళ్లికొడుకు గంగాధర్ బెహరా జెసిబిపై వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. అందరికంటే భిన్నంగా అతను ఎందుకు ఇలా చేశాడని అందరికీ ఆశ్చర్యం వేసింది. తన సోదరుడు జెసిబి ఆపరేటర్ గా పనిచేస్తున్నాడట. అతనికి గౌరవ సూచకంగా వివాహానికి గంగాధర్ ఇలా వచ్చాడని తెలుస్తోంది.

A R Rahman : మసీద్‌లో హిందూ సాంప్రదాయ పెళ్లి.. ఏఆర్ రెహమాన్ ట్వీట్ వైరల్!

నిజానికి కాబోయే అల్లుడు ఆర్భాటంగా కారులో రావాలని ఆడపెళ్లివారు కోరుకుంటారు. అయితే గంగాధర్ తన సోదరుడిని గౌరవిస్తూ చేసిన మంచి పనికి ప్రశంసలు కురిపించారు. ఇక ఆ గ్రామంలో ఎక్కడ చూసిన గంగాధర్ గురించే చర్చించుకుంటున్నారట. తన సోదరుడిపై ప్రేమతో తన పెళ్లికి జెసిబిలో వచ్చి గంగాధర్ ఇలా వార్తల్లోకెక్కాడన్నమాట.