Flashback గుర్తొచ్చిందట: వరుడు తండ్రి-వధువు తల్లి జంప్

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ‘హమ్ ఆప్ కే హై కౌన్’ సినిమా సీన్ రిపీట్ అయింది. సూరత్‌లో ఓ యువ జంటకు కుదిరిన పెళ్లికి సడెన్ బ్రేక్ పడింది. కారణం కుల మతాలు, ఆర్థిక అసమానతలు కాదు. వారిద్దరి తల్లిదండ్రులు ప్రేమలో పడటమే. వరుడి తండ్రికి వధువు తల్లిల మధ్య ప్రేమ యువ జంట పెళ్లి కాకుండా చేసింది.
పెళ్లి అయితే అన్నాచెల్లెళ్లు అవుతారని భయమేసిందో.. పాత రోజుల్లో ప్రేమ గుర్తొచ్చిందో.. మరి కొద్ది వారాల్లో పెళ్లి ఉందనగా పెళ్లి పనులు మానేసి ఇళ్ల నుంచి పరారైయ్యారు. గుజరాత్ లోని సూరత్ లో ఈ ఘటన జరిగింది. కటార్గం ప్రాంతంలో ఉంటున్న వ్యక్తి, నవ్‌సరిలో ఉంటున్న మహిళ చేసిన పనికి ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి.
వివరాల్లోకి వెళితే.. ‘పెళ్లి కొడుకు తండ్రి రాకేశ్(పేరు మార్చాం) టెక్స్‌టైల్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అంతేకాకుండా లోకల్‌గా రాజకీయ నాయకులతో పాటు తిరుగుతున్నాడు. అటువంటి వ్యక్తి జనవరి 10నుంచి కనపడకుండాపోయాడు. ఆమ్రేలీ జిల్లా వాసుడైన రాకేశ్.. వధువు తల్లి(స్వాతి)తో టీనేజ్ నుంచి పరిచయం ఉంది. అప్పట్లో ఇరుగుపొరుగుగా ఉండడంతో పాటు మంచి స్నేహితులు కూడా.
‘ఒకే సొసైటీలో ఇద్దరికీ మంచి పరిచయాలు ఉన్నాయి. గతం నుంచే వీరికి సంబంధం ఉంది. ఓ వజ్రాల వ్యాపారితో వివాహం అయింది. ఆ తర్వాత అతను బ్రోకర్ గా పనిచేస్తున్నాడు. ఈ కుటుంబాల మధ్య ఒకే కమ్యూనిటీ కావడంతో వరుడు, వధువుకు మధ్య పెళ్లి కుదిర్చారు. ఫిబ్రవరి 2వ వారం పెళ్లి జరగాల్సి ఉంది.
ఈ గ్యాప్‌లోనే జనవరి 10నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. తర్వాత విషయం తెలుసుకుని ఇరు కుటుంబాల బంధువులు తిట్టిపోస్తున్నారు. వారిపై పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దొరికిన తర్వాత వారికి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నారు. ఈ ఘటనపై ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.