Abhinandan Vir Chakra : గ్రూప్ కమాండర్ అభినందన్‌కు ‘వీర చక్ర’ అవార్డు!

పాకిస్తాన్ ను గజగజ వణికించిన భారత వైమానిక దళ గ్రూప్ కమాండర్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అభినందన్‌కు వీర చక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది.

Abhinandan Vir Chakra : గ్రూప్ కమాండర్ అభినందన్‌కు ‘వీర చక్ర’ అవార్డు!

Group Captain Abhinandan Varthaman To Be Awarded Vir Chakra Today

Updated On : November 22, 2021 / 12:00 PM IST

Abhinandan Vir Chakra : పాకిస్తాన్ ను గజగజ వణికించిన భారత వైమానిక దళ గ్రూప్ కమాండర్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌ (Abhinandan Varthaman)కు అరుదైన గౌరవం దక్కింది. అభినందన్‌కు వీర చక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం (నవంబర్ 22)న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అభినందన్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆ దేశ F-16 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను కుప్పకూల్చేశాడు అభినందన్.. ఈ క్రమంలో తన విమానం కూలిపోవడంతో అభినందన్‌ను పాక్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత ఇరు దేశ ప్రభుత్వాలతో చర్చల అనంతరం అభినందన్ భారత్‌కు తిరిగి వచ్చాడు.

ఇటీవలే అభినందన్ ను గ్రూపు కెప్టెన్ ర్యాంకుకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత.. 2019, ఫిబ్రవరి 27న భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణలో అభినందన్ ధైర్యసాహసాలు చూపించారు. పాక్ వైమానికదళంతో వీరోచితంగా పోరాడి దాయాదుల ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చాడు. అభినందన్ చూపించిన ధైర్యసాహాసానికి ప్రతీకగా ఆయనకు వీరచక్ర అవార్డును ప్రదానం చేయనున్నారు.

మరోవైపు.. ఈస్ట్రన్ ఆర్మీ కేడర్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ (రిటైర్డ్), ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, దక్షిణ నేవీ కమాండర్ వైస్ అడ్మిరల్ అనిల్ చావ్లాలకు పరమ విశిష్ట సేవ మెడల్‌ను ప్రదానం చేయనున్నారు. ఈస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ దిలీప్ పట్నాయక్‌కు అతి విశిష్ట సేవా అవార్డు ప్రదానం చేయనున్నారు.
Read Also : AP Three Capitals : మూడు రాజధానులపై ఏపీ సర్కారు యూ టర్న్!