Love Jihad: ఇండియాలో లవ్ జిహాదీకి గల్ఫ్ దేశాల సాయం.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
డ్యాన్స్ క్లాసుల పేరుతో బ్రియెన్ వాష్ చేసే వారిని ఎందుకు అడ్డుకోవడం లేదని, ఇందుకు సంబంధిత కమ్యూనిటీకి చెందిన పెద్ద బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 3న మతమార్పిడులకు వ్యతిరేకంగా దీసా పట్టణంలో హిందూ సంఘాలు చేసిన నిరసన చేపట్టాయని గుర్తు చేశారు. లవ్ జిహాదీ పేరుతో మతం మార్చిన ముగ్గుర్ని తిరిగి వారి కుటుంబం చెంతకు పంపాలని అన్నారు

Gujarat BJP MLA blames gulf countries for alleged love jihad in India
Love Jihad: ఇండియాలో లవ్ జిహాదీ లాంటి కార్యకలాపాల్ని రెచ్చగొట్టడానికి గల్ఫ్ దేశాలు సహాయం చేస్తున్నాయని గుజరాత్ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే శశికాంత్ పాండ్యా ఆరోపించారు. ఆదివారం బనస్కంత జిల్లాలో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ముస్లిం మత గురువులకు ఫండింగ్ ఇస్తూ దేశంలో లవ్ జిహాదీని ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు తక్షణం నిలివేయకుంటే తగిన శాస్తి అనుభవించాల్సి వస్తుందని శశికాంత్ హెచ్చరించారు.
డ్యాన్స్ క్లాసుల పేరుతో బ్రియెన్ వాష్ చేసే వారిని ఎందుకు అడ్డుకోవడం లేదని, ఇందుకు సంబంధిత కమ్యూనిటీకి చెందిన పెద్ద బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 3న మతమార్పిడులకు వ్యతిరేకంగా దీసా పట్టణంలో హిందూ సంఘాలు చేసిన నిరసన చేపట్టాయని గుర్తు చేశారు. లవ్ జిహాదీ పేరుతో మతం మార్చిన ముగ్గుర్ని తిరిగి వారి కుటుంబం చెంతకు పంపాలని అన్నారు. ఇలాంటి చర్యలు విఫలమైతే రానున్న రోజుల్లో హిందువులు తీవ్ర నిరసనకు దిగుతారని ఆయన హెచ్చరించారు. గత వారం దీసా ప్రాంతంలోని ఒక యువతి తల్లిని, సోదరుడిని ఆ యువతి ప్రేమికుడు ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు. వారి పెళ్లి అనంతరం ఈ ముగ్గురు ఇస్లాంలోకి మారారు.
Ramon Magsaysay award: రామన్ మెగెసెసే అవార్డు నిరాకరించిన సీపీఎం మహిళా నేత.. కారణమేంటంటే