Rajendra Trivedi : రాజీనామా చేసిన గుజరాత్ అసెంబ్లీ స్పీకర్

గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది రాజీనామా చేశారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని అసెంబ్లీ సెక్రెటరీ ప్రకటన జారీ చేశారు.

Rajendra Trivedi : రాజీనామా చేసిన గుజరాత్ అసెంబ్లీ స్పీకర్

Rajendra Trivedi

Updated On : September 16, 2021 / 2:44 PM IST

Rajendra Trivedi : తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.. ఇదిలా ఉంటే గురువారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తన పదవికి రాజీనామా చేశారు. మరో ఏడాదిలో శాసన సభ ఎన్నికలు జరగాల్సి ఉండగా నేతల రాజీనామా చేస్తుండటం రాజకీయ చర్చకు దారి తీస్తోంది.

Read More : Gujarat CM : గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

అధిష్టానం సూచనతో విజయ్ రూపానీ రాజీనామా చేయగా అతడి స్థానంలో పటేల్ సామజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాజాగా అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది తన పదవి నుంచి తప్పుకున్నారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని అసెంబ్లీ సెక్రెటరీ ప్రకట జారీ చేశారు.

Read More : Gujarat: 17ఏళ్ల టీనేజర్‌పై 23ఏళ్ల మహిళ అఘాయిత్యం

అయితే రాష్ట్రంలో నూతన మంత్రివర్గం కొలువుదీరనున్న నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయడం విశేషం.