ఆ తేదీల్లో ఆ విమానాల్లో ప్రయాణించొద్దు..! ప్రయాణికులకు ఖలిస్తానీ వేర్పాటువాది వార్నింగ్..

తాజాగా పన్నూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ తేదీల్లో ఆ విమానాల్లో ప్రయాణించొద్దు..! ప్రయాణికులకు ఖలిస్తానీ వేర్పాటువాది వార్నింగ్..

Gurpatwant Singh Pannu Warning (Photo Credit : Google)

Updated On : October 21, 2024 / 10:54 PM IST

Gurpatwant Singh Pannu : దేశంలో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా ఫేక్ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ఎయిర్ లైన్స్ సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అటు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు ఎయిర్ లైన్స్ సంస్థలకు భారీగా నష్టం జరుగుతోంది.

వరుస ఫేక్ బాంబు బెదిరింపులు తీవ్రంగా కలవరపెడుతున్న ఇలాంటి సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాది గుర్ పత్వంత్ సింగ్ పన్నూ విమాన ప్రయాణికులకు హెచ్చరికలు చేశాడు. నవంబర్ 1 నుంచి 19వ తేదీల మధ్యలో ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దని అతడు వార్నింగ్ ఇచ్చాడు. భారత్ లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తోందని, ఈ క్రమంలో ఎయిరిండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని పన్నూ పేర్కొన్నాడు. ఆ తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో జర్నీ చేయొద్దని ఓ వీడియోలో అతడు హెచ్చరించాడు. కాగా, పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గత నవంబర్ లోనూ ఇలాంటి వార్నింగ్ లే జారీ చేశాడు.

తాజాగా పన్నూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజ్జర్ హత్య ఘటనలో భారత్ పై విషం కక్కాడు పన్నూ. కెనడా జస్టిన్ ట్రూడో ప్రభుత్వంతో తాను గత మూడేళ్లుగా కాంటాక్ట్ లో ఉన్నట్లు పన్నూ ఆ వీడియోలో స్వయంగా తెలిపాడు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కెనడా ప్రభుత్వానికి తాను ఇంటెలిజెన్స్ సమాచారం అందిస్తున్నట్లు వెల్లడించాడు. భారత ప్రభుత్వం పన్నూని జూలై 2020లో టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసింది.

సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించాడు పన్నూ. అమెరికాలోని వాషింగ్టన్ లో దీని రిజిస్ట్రర్డ్ ఆఫీస్ ఉంది. న్యూయార్క్ లోని ఆఫీస్ నుంచి పన్నూ పని చేస్తున్నాడు. ప్రత్యేక సిక్కుల రాష్ట్రం కావాలన్నది సిఖ్స్ ఫర్ జస్టిస్ ప్రధాన డిమాండ్. భారత దేశం నుంచి పంజాబ్ ను విముక్తి చేయడానికి అతడు 2020 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాడు.

సిఖ్స్ ఫర్ జస్టిస్ వేర్పాటువాద సంస్థను భారత ప్రభుత్వం 2019లోనే బ్యాన్ చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం పన్నూని 2020లో టెర్రరిస్ట్ గా ప్రకటించింది. పన్నూకి కెనడా పౌరసత్వం ఉంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ని, ఆ రాష్ట్ర పోలీస్ చీఫ్ గౌరవ్ యాదవ్ ని చంపుతానని పన్నూ బెదిరించాడు. గ్యాంగ్ స్టర్లు అందరూ కలిసి జనవరి 26న ముఖ్యమంత్రి మాన్ పై దాడి చేయాలని పన్నూ కోరాడు.

Also Read : విమానాలకు వరుస బాంబు బెదిరింపులు.. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీని వెనుక ఉన్నది ఎవరు?