మరో విమానానికి బాంబు బెదిరింపు.. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీని వెనుక ఉన్నది ఎవరు?
నిన్న ఒక్కరోజే 32 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా దీనిపై అప్రమత్తమైంది.

Bomb Scare (Photo Credit : Google)
Bomb Threats : మరో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. జోధ్ పూర్-పుణె ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇవాళ మరో 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొత్తంగా వారం రోజుల వ్యవధిలో 100కు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఫేక్ బాంబు కాల్స్ ఎయిర్ లైన్స్ సంస్థలకు, సిబ్బందికి, అధికారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. అటు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ నెల 14న మొదలైనటువంటి బాంబు బెదిరింపు కాల్స్ రాక కంటిన్యూ అవుతూనే ఉంది. రోజురోజుకు వాటి సంఖ్య పెరుగుతూ పోతోంది.
విదేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా ఈ కాల్స్, మెయిల్స్ అనేవి వస్తున్నాయి. ఇవాళ కూడా ఇప్పటివరకు ఏడు విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. జోధ్ పూర్-ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. విస్తారా ఎయిర్ లైన్స్ కు సంబంధించి మరో 6 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నిన్న ఒక్కరోజే 32 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా దీనిపై అప్రమత్తమైంది.
ఢిల్లీ టు ఫ్రాంక్ ఫర్ట్ వెళ్లే విమానానికి, సింగపూర్ టు ముంబై, బాలి టు ఢిల్లీ, సింగపూర్ టు ఢిల్లీ, సింగపూర్ టు పుణె, ముంబై టు సింగపూర్ వెళ్లే విమానాలకు బాంబు బెదిరింపు వచ్చినట్లు విస్తారా ఎయిర్ లైన్స్ తెలిపింది. ఈ బెదిరింపు కాల్స్ వల్ల విమానయాన సంస్థలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. అటు సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగిపోతోంది. విమాన రాకపోకలు ఆలస్యం అవుతుండటంతో.. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అసలు ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఎవరి పని? వారు ఎందుకిలా చేస్తున్నారు? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, కేరియర్లకు నష్టం కలగకుండా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : అత్యధిక పేదలున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా.. ఎంత మంది పేదరికంలో జీవిస్తున్నారంటే?