పౌరసత్వపు బిల్లు: హుటాహుటిన పోలీసుల ట్రాన్సఫర్లు

పౌరసత్వపు బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అస్సాంలో హద్దు మీరిన అల్లర్లు జరుగుతున్నాయి. అదుపు చేయాల్సిన పోలీసుల వైఫల్యమే దీనికి నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కమిషనర్ ను మార్చేసింది. గువాహటి పోలీస్ కమిషనర్ దీపక్ కుమార్‌ను తప్పించి అతని స్థానంలో మున్నా ప్రసాద్ గుప్తాను రంగంలోకి దింపనున్నారు.
అస్సాం అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్)ను హుటాహుటిన ట్రాన్సఫర్ చేసి కొత్త అధికారిని నియమించారు. ముఖేశ్ అగర్వాల్ ట్రాన్సఫర్ కావడంతో ఏడీజీపీ(సీఐడీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ గొడవల కారణంగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. మంత్రి ఏకే అబ్దుల్ మోమిన్ డిసెంబరు 12నుంచి 14మధ్యలో పర్యటించాల్సి ఉండగా ఆందోళనల నేపథ్యంలో క్యాన్సిల్ చేసుకున్నారు. డిమాండ్ లు పెరుగుతున్న కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నా. జనవరిలో జరిగే మీటింగ్ కు హాజరవ్వాలనుకుంటున్నా. నా బదులు డీజీని పంపుతున్నా’ అని ఆయన చెప్పారు.
జార్ఖండ్‌లోని ధానబడ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోడీ.. కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రంలో అల్లర్లు జరిగేలా ప్రేరేపిస్తుందన్నారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ఇండియన్ ముస్లిం లీగ్ పౌరసత్వపు బిల్లుకు వ్యతిరేకంగా గురువారం, డిసెంబరు 12న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.