Hairstylist: నీటికి బదులు ఉమ్మేసి హెయిర్ స్టైలింగ్ చేసిన జావేద్ హబీబ్

పాపులర్ హైయిర్ స్టైలిష్ట్ జావేద్ హబీబ్ కు సంబంధించిన హెయిర్ స్టైలిషింగ్ వీడియో ఒకటి వైరల్ అయింది. ఓ యువతికి హెయిర్ స్టైల్ చేస్తూ నీటికి బదులు ఉమ్మి వాడటం విమర్శనాత్మకంగా మారింది.

Hairstylist: నీటికి బదులు ఉమ్మేసి హెయిర్ స్టైలింగ్ చేసిన జావేద్ హబీబ్

Jawed Habib

Updated On : January 6, 2022 / 5:04 PM IST

Hairstylist: పాపులర్ హైయిర్ స్టైలిష్ట్ జావేద్ హబీబ్ కు సంబంధించిన హెయిర్ స్టైలిషింగ్ వీడియో ఒకటి వైరల్ అయింది. ఓ యువతికి హెయిర్ స్టైల్ చేస్తూ నీటికి బదులు ఉమ్మి వాడటం విమర్శనాత్మకంగా మారింది. ఆ వీడియోలో మహిళ సెలూన్ ఛైర్ లో కూర్చొని హెయిర్ కట్ కోసం ఎదురుచూస్తుంది. దువ్వెనతో జుట్టును సరిచేస్తూ.. హెయిర్ కేర్ టిప్స్ చెప్తున్నాడు హబీబ్.

‘నా జుట్టు మురికిగా ఉంది. అలా ఎందుకు ఉందంటే నేను షాంపో వాడలేదు. జాగ్రత్తగా వినండి. ఒకవేళ నీరు లేకపోతే ఉమ్మితోనే గడిపేయాలి’ అని చెప్పాడు హబీబ్. అలా చెప్తూనే ఆమె తలపై ఉమ్మి వేసేశాడు. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ట్రైనింగ్ సెమినార్ లో జరిగినట్లుగా చెబుతున్నారు. ఆ వీడియోలో సెలూన్ ఛైర్ పై కూర్చొన్న మహిళను పూజా గుప్తాగా తెలిసింది.

ఇది కూడా చదవండి: వనమా రాఘవేంద్ర రావు అరెస్ట్!

దీనిపై ఆ మహిళ ట్వీట్ చేస్తూ జావేద్ హబీబ్ ప్రవర్తనను ఎండగట్టింది. ‘నిన్న జావేద్ హబీబ్ సార్ సెమినార్‌కు వెళ్లా. హెయిర్ కట్ చేయడానికి స్టేజికి మీదకు పిలిచారు. నీరు లేకపోతే ఉమ్మితోనే హెయిర్ కట్ చేయాలంటూ ఆయన చేసిన తప్పుడు ప్రవర్తన నాకు నచ్చలేదు. అతనితో హెయిర్ కట్ చేయించుకోలేదు. రోడ్ పక్కన సెలూన్ లో అయినా చేయించుకుంటాను గానీ, జావేద్ హబీబ్ దగ్గరకు వెళ్లను’ అని వీడియోలో తెలిపింది.