Quirky Slogans On Trucks : వ్యాక్సిన్ తీసుకుంటే మళ్లీ కలుస్తాం..నిర్లక్ష్యం చేస్తే హరిద్వార్‌లో కలుస్తాం!
ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్నారు.

Hans Mat Pagli Quirky Slogans On Trucks Urge People To Get Vaccinated
Quirky Slogans On Trucks ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్నారు. లేని పోని అపోహలతో వ్యాక్సిన్ తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. అయితే భోపాల్‌కు చెందిన ఓ NGO..వ్యాక్సిన్ ఆవశ్యకతపై వినూత్నంగా అవగాహన కల్పిస్తోంది. రహదారులపై తిరిగే భారీ వాహనాలపై ఆకర్షణీయమైన నినాదాలను రాస్తోంది. జిల్లా యంత్రాంగం మరియు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ(NCSTC)తో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టింది.
భోపాల్ లో ట్రక్కులు, ట్రాక్టర్లు, టెంపోలు,ఇతర వాహనాలపై ప్రాస ఉట్టిపడే నినాదాలు రాసిన ఎన్జీవో ప్రతినిధులు
-మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మళ్లీ మళ్లీ కలుస్తాం..నిర్లక్ష్యం చేస్తే హరిద్వార్‌లో కలుస్తాం,
-నేను అందంగా ఉంటా.. నాకు దిష్టి పెట్టొద్దు. మీరు వ్యాక్సిన్ తప్పక తీసుకుంటే జీవితాంతం మీతో ఉంటా
-నవ్వకండి మీరు ప్రేమలో పడతారు..వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్‌ను జయిస్తారు
-నన్ను ప్రేమతో చూడండి.. కరోనా..టీకాకు భయపడుతుంది.
యాభైకి పైగా ట్రక్కులు, టెంపోలు, ట్రాక్టర్ ట్రాలీలపై ఈ నినాదాలు రాసినట్లు సెర్చ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సొసైటీ ఛైర్పర్సన్ డాక్టర్ మోనికా జైన్ తెలిపారు. భోపాల్ శివార్లలో వీరిని ఆపి.. నినాదాలు రాసేందుకు ఒప్పించినట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని మోనికా జైన్ తెలిపారు.