మాట మార్చిన మంత్రి.. మాట్లాడింది వేరు, మీడియా ప్రచారం చేసింది వేరంట

మాట మార్చిన మంత్రి.. మాట్లాడింది వేరు, మీడియా ప్రచారం చేసింది వేరంట

Updated On : February 14, 2021 / 2:49 PM IST

Haryana Agriculture Minister JP Dalal : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలపై నేతలు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ చేసిన పరుష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో…తన మాటలను మీడియా వక్రీకరించిదంటూ..చెప్పుకొచ్చారు. తాను మాట్లాడింది..వేరు..మీడియా ప్రచారం చేసింది..వేరంటూ..సెలవిచ్చారు. తాను ఎప్పటికీ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటానని, తన మాటలతో ఎవరైనా బాధ పడితే..క్షమించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళన చేస్తున్న వారిలో కొంతమంది చనిపోతుండడం ఆందోళన కలిగించింది. దీనిపై మంత్రి దలాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆందోళన చేస్తున్నందుకే చస్తున్నారా ? ఇంట్లో ఉంటే చావకపోయేవారా అంటూ దారుణంగా కామెంట్స్ చేశారు. రెండు లక్షల మంది ఆందోళన చేస్తుంటే..ఇళ్ల దగ్గరున్నా సరే..ఆరు నెలల్లో వారిలో కనీసం 200 మంది అయినా చనిపోరా అంటూ అంటూ ప్రశ్నించడం తీవ్ర దుమారం రేపింది. మంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగడంతో ఆయన మాటమార్చారు. తాను మాట్లాడిన ఉద్దేశ్యం వేరని..మీడియా తన వ్యాఖ్యలను వేరే విధంగా ప్రచారం చేసిందని తెలిపారు.