Monthly Pension: వచ్చే నెల నుంచి పెళ్లికాని వారికి పెన్షన్.. ఏ వయసువారు దీనికి అర్హులు? నెలకు ఎంతిస్తారో తెలుసా?

పెన్షన్ స్కీమ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దాదాపు 240 కోట్ల రూపాయలను భరిస్తుందని సీఎం చెప్పారు. డేటా ప్రకారం, రాష్ట్రంలో 65,000 మంది అవివాహిత పురుషులు, మహిళలు ఉన్నారు. ఇక నిర్దిష్ట వయస్సుగల వితంతువులు/భార్య చనిపోయిన మగవారు 5,687 మంది ఉన్నారు. వీరికి ఈ స్కీం వర్తించనుంది.

Monthly Pension: వచ్చే నెల నుంచి పెళ్లికాని వారికి పెన్షన్.. ఏ వయసువారు దీనికి అర్హులు? నెలకు ఎంతిస్తారో తెలుసా?

Updated On : July 6, 2023 / 6:58 PM IST

Haryana: వితంతువులకు వృద్ధులకు, దివ్యాంగులు పెన్షన్లు ఎప్పటి నుంచో ఇస్తున్నారు. కొద్ది రోజులుగా నిరుద్యోగులకు భృతి ఇస్తామనే హామీలు పెరిగాయి. నిజానికి ఇది రాజకీయాల్లో ట్రెండుగా మారింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా, నిరుద్యోగ భృతి ప్రతి పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తుంటుంది. ఇక ఇదే వరుసలో మరో ట్రెండ్ రాబోతున్నట్లే కనిపిస్తోంది. అదే పెళ్లికాని వారు. పెళ్లికాని వారికి నెలవారి భృతి ఇస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఆడవారైనా, మగవారైనా.. ఎవరికైనా ఈ స్కీం వర్తిస్తుందని గురువారం చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.

Madhya Pradesh: ‘రీటేక్ అదిరింది.. ఓవరాక్టింగ్ తగ్గించాలి’.. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడి మీద పోలీస్ యాక్షన్‭పై విమర్శలు

ఈ స్కీం వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‭లాల్ ఖట్టర్ ప్రకటించారు. అయితే దీనికి కొన్ని విధివిధానాల్ని ఆయన ప్రకటించారు. వయసు 45 దాటి 60 ఏళ్ల లోపు వారికి ఈ స్కీం వర్తిస్తుందట. అలాగే వారి వార్షికాదాయం 1.8 లక్షల రూపాయల లోపు ఉండే వారికి నెలకు 2,750 రూపాయల పెన్షన్ అందజేయనున్నట్లు ఖట్టర్ గురువారం ప్రకటించారు. వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలకు మించని అదే వయస్సు గల వితంతువులకు, భార్య చనిపోయినవారికి కూడా ఈ పెన్షన్ వర్తిస్తుందని ఆయన తెలిపారు.

Sharad Pawar vs Ajit Pawar: మహా సంక్షోభానికి చెక్ పెట్టిన శరద్ పవార్? అజిత్ పవార్ పని అయిపోయినట్టేనా?

అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్‌ను ఆయన తెలియజేశారు. “ఒంటరి పురుషుడు లేదా స్త్రీ విషయంలో కొన్ని వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి. ఈ నెలవారీ పెన్షన్‌తో ప్రభుత్వం వైపు నుంచి కొంత సహాయం వారికి అందాలి” అని ఆయన అన్నారు. పెన్షన్ స్కీమ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దాదాపు 240 కోట్ల రూపాయలను భరిస్తుందని సీఎం చెప్పారు. డేటా ప్రకారం, హర్యానా రాష్ట్రంలో 65,000 మంది అవివాహిత పురుషులు, మహిళలు ఉన్నారు. ఇక నిర్దిష్ట వయస్సుగల వితంతువులు/భార్య చనిపోయిన మగవారు 5,687 మంది ఉన్నారు. వీరికి ఈ స్కీం వర్తించనుంది.

Telangana Politics: బీఆర్ఎస్, కాంగ్రెస్‭లను టార్గెట్‭ చేస్తూ హాట్ కామెంట్స్ చేసిన కిషన్ రెడ్డి

ఈ లబ్ధిదారులకు 60 ఏళ్లు నిండిన తర్వాత వృద్ధాప్య పింఛను పథకానికి సంబంధించిన వార్షిక ఆదాయ వివరాలను సమర్పిస్తే.. అనంతరం నుంచి వారు వృద్ధాప్య పింఛను పొందడం ప్రారంభిస్తారని ఖట్టర్ చెప్పారు.