రెజ్లర్లకు బీజేపీ టికెట్లు : తొలి జాబితాలో బాబితా ఫోగాట్, యోగేశ్వర్ దత్

హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని అధికారిక బీజేపీ కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనుంది.

  • Published By: sreehari ,Published On : September 30, 2019 / 01:59 PM IST
రెజ్లర్లకు బీజేపీ టికెట్లు : తొలి జాబితాలో బాబితా ఫోగాట్, యోగేశ్వర్ దత్

Updated On : September 30, 2019 / 1:59 PM IST

హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని అధికారిక బీజేపీ కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనుంది.

హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని అధికారిక బీజేపీ కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనుంది. రాష్ట్రంలో 90 స్థానాలు ఉన్న హర్యాణా అసెంబ్లీకి మొత్తం 78 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఇద్దరు రెజ్లర్ క్రీడాకారులకు చోటు దక్కింది.

బాబితా ఫోగాట్, యోగేశ్వర్ దత్ లకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. మొత్తంగా 38 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తుండగా.. ఏడుగురు మాత్రమే పోటీ నుంచి తప్పుకున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. కేంద్ర ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్ అమిత్ షా, బీజేపీ సీనియర్ నేతలతో కలిసి అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. 

మూడు గంటల పాటు చర్చించిన అనంతరం 78 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తోహనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రెజ్లర్ ఫోగాట్ డారి నుంచి పోటీ చేస్తుండగా.. దత్ బరోడా నుంచి పోటీ చేస్తున్నారు.

బీజేపీ నుంచి టికెట్ ఆశించిన ఇద్దరు మంత్రుల్లో.. బాద్ షా పూర్ నుంచి రావ్ నర్ బీర్ సింగ్ ఒకరు.. ఫరీదాబాద్ నుంచి విపుల్ గోయెల్ టికెట్లు ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. 2014 రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలిచింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) 19స్థానాల్లో గెలిచింది. మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 

నవంబర్ 2న హర్యాణా అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. మహారాష్ట్ర, హర్యాణాలో అక్టోబర్ 21 నుంచి కొత్త అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటింగ్ జరుగనుంది. మూడు రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 4న నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 7 వరకు నామినేషన్లు ఉపసంహరణకు తుదిగడువు ఉంది. జాతీయ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అందరి దృష్టి ఈ రెండు రాష్ట్రాలపైనే ఉంది. ఉత్తర రాష్ట్రంలో మొత్తం 1.82 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. మహారాష్ట్రలో 8.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.